ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

Pak: Hindu temple పై దాడి చేసిన 22 మందికి 5 ఏళ్ల జైలుశిక్ష

ABN, First Publish Date - 2022-05-12T17:45:26+05:30

ఈ కేసులో గతేడాది సెప్టెంబర్‌లో 84 మందిని అరెస్ట్ చేశారు. కాగా, ఈ కేసుపై కోర్టుల్లో పలుమార్లు విచారణ జరగ్గా గురువారం పాక్ యాంటీ టెర్రరిజం కోర్టు తుది తీర్పును వెలువరించింది. 22 మందిపై నేరారోపణలు రుజువు కావడంతో వారందరికి 5 ఏళ్లపాటు జైలు..

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

Lahore: గతేడాది Pakistan లోని Punjab province లో ఉన్న హిందూ దేవాలయంపై దాడి చేసిన 22 మందికి ఒక్కొక్కరికి ఐదేళ్ల జైలు శిక్ష విధిస్తున్నట్లు Pakistani anti-terrorism court బుధవారం తీర్పు చెప్పింది. ఎనిమిదేళ్ల ఒక హిందూ బాలుడు మదర్సాలో మూత్రవిసర్జన చేశారన్న ఆరోపణల నేపథ్యంలో  2021 జూలైలో లాహోర్‌కు 590 కిలోమీటర్ల దూరంలో ఉన్న రహీమ్ యార్ ఖాన్ జిల్లాలోని భోంగ్ నగరంలోని గణేశ్ మందిరంపై వందలాది మంది దాడి చేశారు. ఆ దాడిలో గుడిలోని కొన్ని భాగాలు పూర్తిగా ధ్వంసం అయ్యాయి, కొన్ని మంటల్లో దహనమయ్యాయి. అలాగే గుడిలోని దేవతా విగ్రహాలను కొన్నింటిని ధ్వంసం చేశారు.


ఈ కేసులో గతేడాది సెప్టెంబర్‌లో 84 మందిని అరెస్ట్ చేశారు. కాగా, ఈ కేసుపై కోర్టుల్లో పలుమార్లు విచారణ జరగ్గా గురువారం పాక్ యాంటీ టెర్రరిజం కోర్టు తుది తీర్పును వెలువరించింది. 22 మందిపై నేరారోపణలు రుజువు కావడంతో వారందరికి 5 ఏళ్లపాటు జైలు శిక్ష విధించింది. కోర్టు తీర్పు అనంతరం నిందితులందరినీ కట్టుదిట్టమైన భద్రత మధ్య Bahawalpur లోని Central Jailకు తరలించారు. కోర్టు తీర్పు అనంతరం మందిరంలో ధ్వంసమైన భాగాలను పునర్నిర్మించారు. ఈ విషయమై పాకిస్తాన్ chief justice Gulzar Ahmed స్పందిస్తూ గణేష్ మందిరంపై దాడి దేశానికే అవమానకరమని అన్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!