భూమి వైపుగా 1600 అడుగుల గ్రహశకలం
ABN , First Publish Date - 2022-05-14T08:17:00+05:30 IST
భూమి దిశగా భారీ గ్రహశకలం దూసుకొస్తోంది. దాదాపు 1600 అడుగుల వెడల్పు కలిగిన 388945(2008 టీజెడ్3) అనే ఆ శకలం ఈ నెల 16న భూమికి అతి సమీపం నుంచి
25లక్షల మైళ్ల సమీపానికి రానుంది: నాసా
కేప్ కనవెరల్, మే 13: భూమి దిశగా భారీ గ్రహశకలం దూసుకొస్తోంది. దాదాపు 1600 అడుగుల వెడల్పు కలిగిన 388945(2008 టీజెడ్3) అనే ఆ శకలం ఈ నెల 16న భూమికి అతి సమీపం నుంచి దూసుకుపోతుందని అమెరికా అంతరిక్ష సంస్థ నాసా వెల్లడించింది. 2020 మే నెలలో కేవలం 17లక్షల కిలోమీటర్ల దూరంలో ఇది భూమి సమీపం నుంచి వెళ్లిందని వివరించింది. అమెరికాలోని ఎంపైర్ స్టేట్ భవనం, పారిస్‌లోని ఈఫిల్ టవర్ కంటే ఇది చాలా పెద్దదని పేర్కొంది. భూమికి అత్యంత సమీపంలో కేవలం 25లక్షల కిలోమీటర్ల దూరం నుంచి ఇది దూసుకుపోనుందని స్పష్టం చేసింది. అంతరిక్ష లెక్కల్లో ఇది చాలా తక్కువ దూరమని, అందుకే దానిపై ఓ కన్నేసి ఉంచామని చెప్పింది. తిరిగి 2024 మే నెలలో, ఆ తర్వాత 2163లో భూమికి సమీపంలోకి వస్తుందని నాసా వెల్లడించింది.

