ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

Maharashtra: 150 మంది MNS కార్యకర్తల అరెస్ట్

ABN, First Publish Date - 2022-05-05T16:37:08+05:30

మసీదుల వద్ద అక్రమ లౌడ్‌స్పీకర్లను నిషేధించకుంటే అక్కడ Hanuman Chalisa ను రెట్టింపు శబ్దంతో వినిపిస్తామని రాజ్‌ థాకరే మహారాష్ట్ర సర్కార్‌ను హెచ్చరించారు. మసీదుల వద్ద లౌడ్‌స్పీకర్లను తొలగించేంతవరకు తమ కార్యకర్తలు శాంతియుతంగా ఆందోళనలు..

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

ముంబై: Maharashtra లో Loudspeaker ల వివాదం రోజు రోజుకూ తీవ్రమవుతోంది. కాగా, ఈ వివాదం మరింత తీవ్రం చేస్తూ పెరగొడుతున్నారన్న కారణంతో నాసిక్ జిల్లాలోని Maharashtra Navnirman Sena పార్టీకి చెందిన 150 మంది కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. మసీదుల వద్ద లౌడ్‌స్పీకర్లు తొలగించకపోతే రెట్టింపుశబ్దంతో హనుమాన్ చాలీసా వినిపిస్తామంటూ ఎంఎన్ఎస్ అధినేత Raj Thakeray చేసిన హెచ్చరికలతో రాష్ట్రంలో శాంతి భద్రతలు దెబ్బతినకుండా ఉండేందుకు ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని, అందులో భాగంగానే ఎంఎన్ఎస్ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నట్లు మహా పోలీసులు తెలిపారు. ఇందులో కొంత మంది మత విధ్వేష వ్యాఖ్యలకు పాల్పడ్డట్లు తమకు ఫిర్యాదు అందినట్లు పోలీసులు పేర్కొన్నారు.


మసీదుల వద్ద అక్రమ లౌడ్‌స్పీకర్లను నిషేధించకుంటే అక్కడ Hanuman Chalisa ను రెట్టింపు శబ్దంతో వినిపిస్తామని  రాజ్‌ థాకరే మహారాష్ట్ర సర్కార్‌ను హెచ్చరించారు. మసీదుల వద్ద లౌడ్‌స్పీకర్లను తొలగించేంతవరకు తమ కార్యకర్తలు శాంతియుతంగా ఆందోళనలు కొనసాగిస్తునే ఉంటారని అన్నారు. Supreme నిబంధనలు ఉల్లంఘిస్తూ శబ్దకాలుష్యానికి కారణమైన లౌడ్‌స్పీకర్లను మసీదుల వద్ద నిషేధించాల్సిందేనని ఆయన బుధవారం మీడియా సమావేశంలో మరోసారి డిమాండ్‌ చేశారు. మసీదులతోపాటు చాలావరకు ఆలయాల్లోనూ భారీ లౌడ్‌స్పీకర్లను వినియోగిస్తున్నారన్న ఆయన.. లౌడ్‌స్పీకర్ల అంశం మతపరమైంది కాదని, అదొక సామాజిక అంశమని పునరుద్ఘాటించారు.


ముంబైలోని 1,140 మసీదుల్లో 135 మసీదులు బుధవారం సుప్రీం నిబంధనలు ఉల్లంఘించి లౌడ్‌స్పీకర్లను వినియోగించాయని.. వాటిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలని పోలీసులను ఠాక్రే ప్రశ్నించారు. 45-55 డెసిబల్స్‌కు మించకుండా లౌడ్‌ స్పీకర్లను వినియోగించవచ్చన్న సుప్రీం నిబంధనను ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు. కాగా, ముంబైలోని చార్కోప్‌ ప్రాంతంలోని మసీదు వద్ద ఎంఎన్‌ఎస్‌ కార్యకర్తలు కొందరు హనుమాన్‌ చాలీసాను లౌడ్‌ స్పీకర్లలో  వినిపించారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!