ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Collapse Cable bridge: కుప్పకూలిన తీగల వంతెన...140కి చేరిన మృతుల సంఖ్య

ABN, First Publish Date - 2022-10-31T07:00:01+05:30

గుజరాత్ రాష్ట్రంలోని మోర్బీలో(Gujarats Morbi) తీగల వంతెన కుప్పకూలిన(Collapse Cable bridge) ఘటనలో మృతుల సంఖ్య 140కి చేరింది.మోర్బీ జిల్లాలోని మచ్చు నదిలో ఆదివారం సాయంత్రం వేలాడే వంతెన కూలిపోవడంతో 140 మంది మృతి చెందగా, పలువురు గాయపడ్డారు.

bridge collapses in Gujarats Morbi
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అహ్మదాబాద్ (గుజరాత్): గుజరాత్ రాష్ట్రంలోని మోర్బీలో(Gujarats Morbi) తీగల వంతెన కుప్పకూలిన(Collapse Cable bridge) ఘటనలో మృతుల సంఖ్య 140కి చేరింది.మోర్బీ జిల్లాలోని మచ్చు నదిలో ఆదివారం సాయంత్రం వేలాడే వంతెన కూలిపోవడంతో 140 మంది మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విమానంతో పాటు ఎన్డీఆర్ఎఫ్,ఆర్మీ,ఎయిర్ ఫోర్స్, నావికా బృందాలను(Army, Navy, Air Force, NDRF, SDRF) సహాయ చర్యల కోసం మోర్బీ వంతెన వద్ద రంగంలోకి దించారు. కొత్తగా పునర్ నిర్మించిన కేబుల్ బ్రిడ్జీని తమ అనుమతి లేకుండానే తెరిచారని మోర్బీ మున్సిపల్ చీఫ్ ఆఫీసర్ సందీప్ సింగ్ ఝూలా చెప్పారు.(Bridge opened without our permission) మచ్చు నదిలో పడిన వారిని రక్షించేందుకు సహాయ చర్యలు కొనసాగుతున్నాయని గుజరాత్ పోలీసులు చెప్పారు. మృతుల కుటుంబాలకు గుజరాత్ ప్రభుత్వం రూ.4 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. ఈ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు రూ.2 లక్షల పరిహారాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. వంతెన కూలి జరిగిన మరణాలకు ఎవరు బాధ్యులని కాంగ్రెస్‌ పార్టీ ప్రశ్నించింది. ‘‘గుజరాత్‌ మోర్బీ దుర్ఘటనను ఖండిస్తున్నాను, 140 మంది మరణించారు,మరో 100 మంది గాయపడటానికి ఎవరు బాధ్యులు? మోర్బీ మునిసిపల్ చీఫ్ ఆఫీసర్‌ అధికారిక అనుమతి లేకుండా తీగల వంతెన ఎలా తెరిచారు?’’ అని కాంగ్రెస్ జాతీయ అధికార ప్రతినిధి సుప్రియా ష్రినేట్(Supriya Shrinate) ట్వీట్(tweet) చేశారు.

Updated Date - 2022-10-31T07:41:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising