ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Mummies: బంగారు నాలుకలు ఉన్న మమ్మీలు గుర్తింపు..

ABN, First Publish Date - 2022-11-28T20:13:38+05:30

బంగారు నాలుకలు ఉన్న పలు మమ్మీలను (mummies) ఈజిప్ట్ పురాతత్వవేత్తలు గుర్తించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కైరో: బంగారు నాలుకలు ఉన్న పలు మమ్మీలను (mummies) ఈజిప్ట్ పురాతత్వవేత్తలు గుర్తించారు. ఈజిప్ట్‌లోని (Egypt) క్వెస్నా (Quesna) శ్మాసనవాటిలో గుర్తించిన ఈ మమ్మీలు ప్రాచీనకాలంలో వేర్వేరు సమయాలకు చెందినవని నిర్ధారించారు. సుప్రీం కౌన్సిల్ ఫర్ ఆర్కియాలజీ ఆదేశాలు ఇవ్వడంతో పురాతత్వ సంబంధ ఆవరణ వెలుపలి ప్రదేశంలో ఈ మిషన్‌ చేపట్టారని ‘ఈజిప్ట్ ఇండిపెండెంట్’ రిపోర్ట్ పేర్కొంది. కొన్ని అస్థిపంజరాల ఎముకలు బంగారంతో మెరిసిపోతున్నాయని వెల్లడించారు. బంగారం లైనింగ్ ఉన్న మమ్మీల ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉండగా.. ఇతర మమ్మీల పరిస్థితి అలా లేదని తెలిపారు. కొన్ని శవపేటికలను చెక్కతో చేశారని, వాటిలో ఉపయోగించిన రాగి మేకులను ఆ ప్రదేశంలో గుర్తించారని రిపోర్ట్ పేర్కొంది. ప్రస్తుతం మమ్మీలను కొనుగొన్న ఈ ప్రదేశాన్ని 1989లో గుర్తించారు. క్రీస్తుపూర్వం 300 నుంచి క్రీస్తుశకం 640 మధ్యకాలంలో ఈ ప్రాంతం ఆక్రమణకు గురయిఉంటుందని అంచనావేస్తున్నారు.

కాగా 2021లో కూడా ఇదే తరహా కొన్ని మమ్మీలను గుర్తించారు. 2000 ఏళ్లనాటి పురాతన ప్రాంతంలో తవ్వకాలు జరిపి నాలుక ఆకారంలో ఉన్న నగలను గుర్తించారు. కొన్ని నెలలక్రితం కూడా నాలుక ఆకారం ఉన్న నగను ధరించిన ఒక పురుషుడు, మహిళ, బాలుడి మమ్మీలను గుర్తించారు. ఈ మమ్మీలు 2,500 ఏళ్లకు పూర్వానివని తెలిపారు.

Updated Date - 2022-11-28T20:13:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising