ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Awareness: ఐ పిల్‌ ఎప్పుడు?

ABN, First Publish Date - 2022-11-30T15:22:17+05:30

గర్భ నిరోధక మాత్రల వాడకం గురించి తెలిసినంతగా వాటి పనితీరు గురించిన అవగాహన లేదు. మరీముఖ్యంగా ఐ పిల్‌ లాంటి ఎమర్జెన్సీ కాంట్రాసెప్టివ్స్‌ను విచక్షణ లేకుండా వాడేస్తూ

ఐ పిల్‌ ఎప్పుడు?
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గర్భ నిరోధక మాత్రల వాడకం గురించి తెలిసినంతగా వాటి పనితీరు గురించిన అవగాహన లేదు. మరీముఖ్యంగా ఐ పిల్‌ లాంటి ఎమర్జెన్సీ కాంట్రాసెప్టివ్స్‌ను విచక్షణ లేకుండా వాడేస్తూ ఉంటారు. ఇది చాలా ప్రమాదకరం. ఐ పిల్‌ అనేది గర్భనిరోధక పద్ధతులను అవలంబిస్తూ పొరపాటున మర్చిపోయిన సందర్భంలోనే వాడాలి. నెలలో ఒకటి రెండుసార్ల వరకూ ఫర్వాలేదు. అలాకాకుండా ఐ పిల్స్‌నే శాశ్వత గర్భనిరోధక సాధనంగా వాడటం వల్ల శరీరంలో హార్మోన్ల హెచ్చుతగ్గులు ఏర్పడి నెలసరి క్రమం తప్పటం, అబార్షన్స్‌, గర్భం దాల్చలేకపోవటంలాంటి సమస్యలకు దారితీయొచ్చు. ఒకవేళ అప్పటికే గర్భందాల్చి ఉండి పిల్‌ వాడితే దాని ప్రభావం పిండం మీద పడి జన్యుపరమైన సమస్యలతో బిడ్డ పుట్టే ప్రమాదం ఉంటుంది. నిజానికి ఐ పిల్‌ అనేది పూర్తి స్థాయిలో గర్భధారణని అడ్డుకోలేదు. ఇది ఫెయిలయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. ఎమర్జెన్సీ కాంట్రాసెప్టివ్‌ మాత్రలను 25 నుంచి 40 ఏళ్ల మధ్య వయస్కులే వాడాలి. అంటే అండాశయాలు పూర్తిగా తయారయిన వాళ్లు మాత్రమే వాడాలి. అలాకాకుండా 16 ఏళ్ల వయసు నుంచే ఈ మాత్రలు వాడకం మొదలుపెడితే భవిష్యత్తులో దీర్ఘకాల సమస్యలు ఎదుర్కోవలసివస్తుంది. కాబట్టి స్త్రీలు ఈ మాత్రల మీద ఆధారపడకుండా వైద్యుల్ని కలిసి ఇతరత్రా గర్భనిరోధక ప్రత్యామ్నాయాల గురించి తెలుసుకుని అవలంబించటం ఆరోగ్యకరం.

Updated Date - 2022-11-30T15:22:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising