సూయిసైడ్ చేసుకునేవాళ్లలో బయల్పడే ఆ సైన్స్ ఇవే...
ABN , First Publish Date - 2022-05-10T17:46:41+05:30 IST
క్షణికోద్రేకంలో ఆత్మహత్యకు పాల్పడే వాళ్ల కంటే, ప్రణాళికాబద్ధంగా ఆత్మహత్యను అమలు చేసే వాళ్లు ఎక్కువ మంది ఉంటారు. సూయిసైడ్‌కు ఎంతో కాలం ముందు నుంచీ వీళ్లు వాళ్ల

ఆంధ్రజ్యోతి(10-05-2022)
క్షణికోద్రేకంలో ఆత్మహత్యకు పాల్పడే వాళ్ల కంటే, ప్రణాళికాబద్ధంగా ఆత్మహత్యను అమలు చేసే వాళ్లు ఎక్కువ మంది ఉంటారు. సూయిసైడ్‌కు ఎంతో కాలం ముందు నుంచీ వీళ్లు వాళ్ల ప్రణాళికను చూచాయగా బయటపెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆ చిహ్నాలను కనిపెట్ట గలిగితే ఆత్మహత్యలను ఆపవచ్చు. సూయిసైడ్ చేసుకునేవాళ్లలో బయల్పడే ఆ సైన్స్ ఇవే...
కుటుంబానికి బరువైపోయానని బాధపడుతూ ఉండడం
నిర్లక్ష్యంగా నడుచుకుంటూ ఉండడం
బయటపడే మార్గం లేక ఇరుక్కుపోయిన భానవలో ఉండడం
నిరాసక్తత, నిర్లిప్తత, నిస్సహాయతలను వ్యక్తపరుస్తూ, నిరాశావాదంతో వ్యవహరిస్తూ ఉండడం
ఒంటరిగా గడుపుతూ ఉండడం
ఏ పని మీదా ఆసక్తి లేకపోవడం
మద్యం/మాదకద్రవ్యాల మోతాదు పెంచడం
తిండి, నిద్ర మానేయడం
మరణం గురించి మాట్లాడడం, సంబంధించిన వీడియోలు చూడడం, సమాచారం సేకరించడం
మానసిక ఒత్తిడి, ఆందోళన, కుంగుబాటు లాంటి లక్షణాలను కలిగి ఉండడం