ఒత్తిడి దాడి ఇలా...
ABN , First Publish Date - 2022-05-10T19:05:30+05:30 IST
ఒత్తిడి శరీరంలోని వేర్వేరు అంతర్గత అవయవాల్లో నిల్వ ఉండిపోయి, వాటిని నెమ్మదిగా కుదేలు చేస్తుంది. దాంతో ఆయా అవయవాలకు సంబంధించిన కొన్ని ఆరోగ్య సమస్యలు మొదలవుతాయి. అవేంటంటే...

ఆంధ్రజ్యోతి(10-05-2022)
ఒత్తిడి శరీరంలోని వేర్వేరు అంతర్గత అవయవాల్లో నిల్వ ఉండిపోయి, వాటిని నెమ్మదిగా కుదేలు చేస్తుంది. దాంతో ఆయా అవయవాలకు సంబంధించిన కొన్ని ఆరోగ్య సమస్యలు మొదలవుతాయి. అవేంటంటే...
చర్మం: ఎగ్జీమా, సోరియాసిస్, మొటిమలు
పొట్ట: అల్సర్లు, ఇర్రిటబుల్ బోవెల్ సిండ్రోమ్, ఫుడ్ అలర్జీ, పొట్ట నొప్పి, యాసిడ్ రిఫ్లక్స్, వాంతులు
పాంక్రియాస్: ఇన్సులిన్ ఉత్పత్తి అవసరానికి మించి పెరగడం, ఆర్టిరీలు దెబ్బతినడం, ఒబేసిటీ
రోగనిరోధక వ్యవస్థ: ఇమ్యూనిటీ కుంటుపడి, శరీరంలో ఇన్ఫ్లమేషన్ పెరగడం
తల: భావోద్వేగాలు అదుపు తప్పడం, కోపం, మానసిక కుంగుబాటు, ఏకాగ్రతా లోపం, చికాకు, ప్యానిక్ ఎటాక్స్
గుండె: అధిక రక్తపోటు, గుండె వేగం పెరగడం, కొలెస్ట్రాల్ పెరగడం
పేగులు: పోషక శోషణ సామర్థ్యం తగ్గడం, మెటబాలిజం తగ్గడం, ఇన్ఫ్లమేటరీ బోవెల్ సిండ్రోమ్
పునరుత్పత్తి వ్యవస్థ: టెస్టోస్టెరాన్, ఈస్ట్రోడైల్ హార్మోన్ల మోతాదు తగ్గడం మూలంగా పిల్లలు కలగకపోవడం, లైంగికాసక్తి లోపించడం
కీళ్లు, కండరాలు: నొప్పులు, వాపులు, భుజాలు, వెన్ను బిగుసుకుపోయినట్టు ఉండడంఇలా ఒత్తిడి అంతర్గత అవయవాల పనితీరును దెబ్బతీస్తూ వేర్వేరు లక్షణాల రూపంలో బయల్పడుతూ ఉంటుంది. కాబట్టి సమస్య మూలం ఒత్తిడి అని తెలిసినప్పుడు, ఆయా రుగ్మతలకు చికిత్స తీసుకోవడంతో పాటు ఒత్తిడిని తొలగించే ధ్యానం, యోగాలను కూడా సాధన చేయాలి.