ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Infections: హైదరాబాద్‌లో మాస్కు ధరించడమే మేలు!

ABN, First Publish Date - 2022-12-16T10:50:30+05:30

రాష్ట్రం (Telangana)లో ఇన్‌ఫెక్షన్లు (Infections) పెరుగుతున్నాయి. వైరస్‌ (Virus)లు క్రమంగా విస్తరిస్తున్నాయి. అసలే చలికాలం (winter).. ఆపై తేమ వాతావరణంతో ప్రజలు జబ్బుల బారిన

మాస్కు ధరించడమే మేలు!
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బాబోయ్‌ ఇన్‌ఫెక్షన్లు

పెరిగిన శ్వాసకోశ, గొంతు సమస్యలు

వైద్యుల వద్దకు రోజుకు ఐదారు కేసులు

హైదరాబాద్‌లో అక్కడక్కడా స్వైన్‌ఫ్లూ

2 నెలలు మాస్కు ధరించడమే మేలు

హైదరాబాద్‌ సిటీ, డిసెంబరు 15 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రం (Telangana)లో ఇన్‌ఫెక్షన్లు (Infections) పెరుగుతున్నాయి. వైరస్‌ (Virus)లు క్రమంగా విస్తరిస్తున్నాయి. అసలే చలికాలం (winter).. ఆపై తేమ వాతావరణంతో ప్రజలు జబ్బుల బారిన పడుతున్నారు. గొంతు, శ్వాసకోశ (అప్పర్‌ రెస్పిరేటరీ) సంబంధిత వైర్‌సలు విస్తరిస్తున్నాయని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా జలుబు కారకమైన ‘రెస్పిరేటరీ సిన్‌కైషియల్‌ వైరస్‌ (ఆర్‌ఎస్‌వీ)’, మైల్డ్‌ కొవిడ్‌, స్వైన్‌ఫ్లూ (Swine flu) ప్రభావం చూపుతున్నాయని తెలిపారు. కొవిడ్‌ (covid) తీవ్రత తగ్గిపోవడంతో మాస్కులు, భౌతిక దూరం, పరిశుభ్రత వంటివి పాటించడం లేదని.. ఇప్పటి నుంచి కనీసం రెండు నెలల పాటు తప్పనిసరిగా ఈ జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. వాతావరణంలో తేమ ఎక్కువ కావడంతో బ్యాక్టీరియా, వైరస్‌ విజృంభిస్తాయి. ఈ తరహా వాతావరణం శ్వాసకోశ వ్యాధులకు అనుకూలంగా ఉంటుంది. ఈ వాతావరణంలో వైరస్‌ బలం పుంజుకుని దాడి చేసే ప్రమాదం ఎక్కువ. దీనివల్ల జనం అకస్మాత్తుగా జబ్బుల బారిన పడే ప్రమాదం ఉందని వైద్యులు తెలిపారు. సాధారణంగా డిసెంబరు, జనవరి నెలల్లో వైర్‌సల విజృంభణ ఎక్కువగా ఉంటుంది. స్వైన్‌ఫ్లూ, ఆర్‌ఎస్‌వీ ఇన్‌ఫెక్షన్లు ఎక్కువగా కనిపిస్తున్నాయని వివరించారు. ముఖ్యంగా చిన్నారులు జ్వరాల బారిన పడుతున్నారని, హైదరాబాద్‌ (Hyderabad)లోని పలు స్కూళ్లలో 50% దాకా విద్యార్థులు ఆబ్సెంట్‌ అవుతున్నారని యాజమాన్యాలు తెలిపాయి. కొవిడ్‌ ప్రభావం బాగా తగ్గిపోయింది. దాన్ని సాధారణ జలుబుగా పరిగణిస్తున్నారు. ఇంకా కేసులు వస్తూనే ఉన్నా సాధారణ మందులతో తగ్గిపోతోంది. కొందరిలోనే దాని తీవ్రత కనిపిస్తోందని వైద్యులు చెబుతున్నారు. కొవిడ్‌ తగ్గిపోయిందని నిర్లక్ష్యంగా ఉండొద్దని సూచిస్తున్నారు. ప్రస్తుతం కొవిడ్‌తో పాటు స్వైన్‌ఫ్లూ, ఆర్‌ఎస్‌వీలు ఎక్కువగా ఉంటున్నాయని అంటున్నారు. ఆర్‌ఎస్‌వీ పిల్లల నుంచి మొదలై పెద్దలకు సోకుతుందని అంటున్నారు. ఆర్‌ఎస్‌వీ అంటే.. జలుబులో ఒక కారకమైన ఇన్‌ఫెక్షన్‌. దగ్గు, జ్వరం, జలుబు, ఇన్‌ఫెక్షన్ల లక్షణాలు ఉంటే ఆర్‌ఎస్‌వీగా అనుమానించాలని.. ప్రత్యేకమైన ఆర్టీపీసీఆర్‌తో నిర్ధారించుకోవాలని వైద్యులు చెబుతున్నారు.

ముక్కులో ఉష్ణోగ్రత తగ్గితే

ముక్కులోనే వైర్‌సల నుంచి కాపాడే రక్షణ వ్యవస్థ ఉంటుంది. ఎలాంటి వైరస్‌ అయినా ముక్కులోనే నియంత్రించే గుణం శరీరానికి ఉంటుంది. ముక్కులో సాధారణంగా ఆవిరైపోయే విధానం ఉంటుందని వైద్యులు వివరించారు. వైర్‌సను ఊపిరితిత్తుల్లోకి వెళ్లకుండా నియంత్రిస్తుంది. ముక్కులో తగినంత ఉష్ణోగ్రత లేకపోతే ఆ వైరస్‌ శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఈ సీజన్‌లో శరీరాన్ని వేడిగా ఉంచుకోవా లి. మాస్కు పెట్టుకోవడం వల్ల ముక్కు భాగం వేడిగా ఉంటుంది. మంకీ క్యాప్‌ను కూడా ధరించవచ్చు. సీజనల్‌ జ్వరాలు, పోస్ట్‌ కొవిడ్‌ లక్షణాలతో బడుల్లో విద్యార్థుల హాజరు శాతం పడిపోతోందని తెలంగాణ గుర్తింపు పొందిన స్కూలు యాజమాన్యాల సంఘం(టీఆర్‌ఎస్‌ఎంఏ) వెల్లడించింది. కొన్ని స్కూళ్లలో గైర్హాజరీ 50% దాకా ఉందని తెలిపింది. బుధవారం అల్వాల్‌లోని ఓ స్కూల్‌లో 400 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు ఆ స్కూల్‌ ప్రిన్సిపాల్‌ వివరించారు.

తుంపర్ల ద్వారా వ్యాప్తి

ఆర్‌ఎస్‌వీ, స్వైన్‌ఫ్లూ కూడా కొవిడ్‌ మాదిరిగానే తుంపర్ల ద్వారా ఒకరి నుంచి మరొకరికి సోకుతాయి. ఎవరైనా తుమ్మినా, దగ్గినా ఇతరులకు త్వరగా వ్యాపిస్తాయి. ఈ వైరస్‌ ప్రభావం పిల్లలపై ఎక్కువగా ఉంటుంది. డిసెంబరు, జనవరి.. రెండు నెలలూ మాస్కులు వేసుకోవాలి. ఎప్పటికప్పుడు చేతులను శుభ్రంగా కడుక్కోవాలి. ఈ వాతావరణంలో సాధారణ సర్జికల్‌ మాస్కు సరిపోతుంది. పండ్లు ఎక్కువగా తీసుకోవాలి. సి విటమిన్‌ ఉన్న వాటిని తప్పని సరిగా రోజూ తినాలి. పాలలో పసుపు, కొద్దిగా మిరియాల పొడి కలిపి తాగాలి. స్వైన్‌ఫ్లూ వ్యాక్సిన్‌ వేసుకోవాలి. ఆర్‌ఎస్‌వీకి వ్యాక్సిన్‌ లేదు.

- డాక్టర్‌ రాజేశ్‌, జనరల్‌ ఫిజీషియన్‌, స్టార్‌ ఆస్పత్రి

Updated Date - 2022-12-16T10:50:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising