ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

జుట్టు బలంగా పెరగాలంటే ఏం చేయాలి?

ABN, First Publish Date - 2022-05-06T21:23:05+05:30

పిల్లలైనా పెద్దలైనా జుట్టు ఆరోగ్యంగా ఉండడానికి ప్రొటీన్లు ఎంతో అవసరం. ప్రొటీన్లు ఎక్కువగా ఉండే చికెన్‌, చేప, గుడ్లు లాంటి మాంసాహారంతో పాటు పాలు

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

ఆంధ్రజ్యోతి(06-05-2022)

ప్రశ్న: మా పాపకు పదేళ్లు. జుట్టు బలంగా పెరగాలంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలి?


- అరుణ, వనపర్తి


డాక్టర్ సమాధానం: పిల్లలైనా పెద్దలైనా జుట్టు ఆరోగ్యంగా ఉండడానికి ప్రొటీన్లు ఎంతో అవసరం. ప్రొటీన్లు ఎక్కువగా ఉండే చికెన్‌, చేప, గుడ్లు లాంటి మాంసాహారంతో పాటు పాలు, పెరుగు, పప్పు ధాన్యాలు పిల్లలకు విరివిగా ఇస్తే మంచిది. రోజుకు కనీసం అరలీటరు పాలు లేదా పెరుగు, ఒకటో రెండో గుడ్లు పిల్లలకు ఇవ్వవచ్చు. కేవలం ప్రొటీన్లు మాత్రమే కాకుండా శరీరానికి అవసరమైన ఐరన్‌, జింక్‌, సెలీనియం మొదలైన ఖనిజాలు పుష్కలంగా ఉన్న చేప, రొయ్యలు, కందులు, పెసలు, మినుములు మొదలైన పప్పు ధాన్యాలు, బాదం, పిస్తా, వాల్‌నట్స్‌, అవిసె గింజలు మొదలైనవి కూడా పిల్లల ఆహారంలో భాగం చేయాలి. వీటన్నిటి వల్ల ఆరోగ్యకరమైన, ఒత్తైన జుట్టుకు అవసరమైన ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు కూడా లభిస్తాయి. పిల్లలకు పోషకాలు తక్కువ, కెలోరీలు ఎక్కువ ఉండే ఫాస్ట్‌ ఫుడ్స్‌, చాక్‌లెట్స్‌, స్వీట్స్‌ మొదలైన చిరుతిళ్ళు తగ్గించి విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉండే బాదం, ఆక్రోట్‌, వేరుశెనగ లాంటి గింజలు, అన్ని రకాల కాయగూరలు, పండ్లు, ఆకు కూరలను రోజూ అందిస్తే వారి జుట్టు ఆరోగ్యంగా ఉండడమే కాక, ఎదుగుదల కూడా సక్రమంగా ఉంటుంది.


డా. లహరి సూరపనేని

న్యూట్రిషనిస్ట్, వెల్‌నెస్ కన్సల్టెంట్

nutrifulyou.com(పాఠకులు తమ సందేహాలను

sunday.aj@gmail.comకు పంపవచ్చు)

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!