అందాన్ని కాపాడుకోవడానికి ఇలా చేయండి!
ABN , First Publish Date - 2022-05-05T19:55:38+05:30 IST
గ్రీన్ లేదా బ్లాక్ ఎలాంటి టీ బ్యాక్ అయినా కళ్ల వాపులు, మంటలను తగ్గిస్తుంది. టీలో ఉండే
ఆంధ్రజ్యోతి(05-05-2022)
గ్రీన్ లేదా బ్లాక్ ఎలాంటి టీ బ్యాక్ అయినా కళ్ల వాపులు, మంటలను తగ్గిస్తుంది. టీలో ఉండే యాంటీ ఇరిటెంట్ గుణాలు కళ్ల చుట్టూ ఉండే వాపును తగ్గిస్తాయి. అయితే ఈ ఫలితాన్ని పొందాలంటే టీ బ్యాగ్‌లను ఎలా ఉపయోగించాలో తెలుసుకోవాలి.
వాడేసిన 2 టీ బ్యాగులను 30 నిమిషాలపాటు ఫ్రిజ్‌లో ఉంచాలి. తర్వాత వీటిని ఫ్రిజ్ నుంచి బయటకు తీసి, వెల్లకిలా పడుకుని మూసిన కళ్ల మీద ఉంచుకోవాలి. ఈ టీ బ్యాగులు కళ్లను పూర్తిగా కప్పేలా చూసుకోవాలి. అలా 10 నిమిషాలపాటు టీ బ్యాగులను కళ్ల మీద ఉంచుకుని తీసేయాలి. ఇలా వారానికోసారి చేస్తే కళ్ల మంటలు తగ్గుతాయి.