Winter: దుర్వాసన రాకుండా ఉండాలంటే..!
ABN, First Publish Date - 2022-12-15T11:44:01+05:30
అసలే చలికాలం(Winter). ఎక్కడ ఉండే తేమ అక్కడ ఉంటుంది. నీళ్లు పడినా త్వరగా ఆరిపోవు. ఇళ్లంతా ముసురు వాసన కమ్మినట్లుంటుంది. ముక్కులకు దుర్వాసన రాకుండా
అసలే చలికాలం(Winter). ఎక్కడ ఉండే తేమ అక్కడ ఉంటుంది. నీళ్లు పడినా త్వరగా ఆరిపోవు. ఇళ్లంతా ముసురు వాసన కమ్మినట్లుంటుంది. ముక్కులకు దుర్వాసన రాకుండా ఉండాలంటే.. కొన్ని చిట్కాలు(Tips) పాటించాల్సిందే.
కొందరు ఇళ్లంతా ఒక విధమైన వాసన అంటూ బాధపడుతుంటారు. ముఖ్యంగా గాలి తగిలితే ఈ వాసన పోతుంది. అందుకోసం తలుపులు, కిటికీలు ఎక్కువ సమయం తెరచి ఉంచాలి. దీని వల్ల బయటిగాలి ఇంట్లోకి వచ్చి చెడు వాసన(bad smell) ఉండదు.
దుప్పట్లు, కార్పెట్స్, ఫర్నిచర్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. బట్టలు, తువాళ్లు విషయంలో కూడా అలానే ఉండాలి. ఎప్పటికప్పుడు శుభ్రపరచాలి.
వంటగది(kitchen)లో సింక్ ఉండే ప్రాంతం, నిల్వ ఉండే ఆహారపదార్థాలు, కింద పడిన తిండి పదార్థాల వల్ల కూడా చెడు వాసన వస్తుంది. వీటి విషయంలో జాగ్రత్త పాటించాల్సిందే.
అగరబత్తీల వాసన కూడా ఇంట్లోని చెడును పోగొడుతుంది. కొత్త ఫీల్‌ను తెస్తుంది. లైట్ క్యాండిల్స్, డిఫ్యూజర్స్ సరికొత్తని లుక్‌తో పాటు గదిని అందంగా చేస్తాయి కూడా.
రూమ్ ఫ్రెష్నర్స్ వాడితే చక్కటి ఫలితం ఉంటుంది. ముఖ్యంగా వాష్‌రూమ్స్(Washrooms)లో వాడటం తప్పనిసరి!
ఏమీ లేకపోతే సిట్రస్ ఆమ్లం ఉండే నిమ్మ, నారింజ పండ్ల తొక్కలు తీసి బౌల్లో వేసుకుని చిన్న మంట మీద ఇరవై నిమిషాలు వేడిచేస్తే.. వాటినుంచి మంచి సువాసన వస్తుంది.
వంటగదిలో గ్రాసరీస్ నిల్వచేసే డబ్బాలు పొడిగా ఉండేట్లు చూసుకోవాలి. కూరగాయలు, పండ్లు నుంచి వచ్చే వేస్ట్‌ను ఇంట్లో పడకుండా చూసుకోవాలి.
మంచి వాసన ఉండే పూలతో ఇంట్లో ఒక పాజిటివ్, హ్యాపీ మూడ్ క్రియేట్ అవుతుంది. ఇక ఎండిపోయిన పూలను కూడా ఒక బుట్టలో వేసుకుంటే మంచి వాసన ఉంటుంది.
Updated Date - 2022-12-15T11:45:34+05:30 IST