ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

అయినా... డైటింగ్‌ చేయాలా?

ABN, First Publish Date - 2022-05-13T18:05:06+05:30

రోజూ వ్యాయామం చేసేవారు కూడా ఆహార విషయంలో జాగ్రత్తలు పాటించాలా? లేదా కావలసిన మోతాదులో, నచ్చిన ఆహారం తినవచ్చా?

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

ఆంధ్రజ్యోతి(13-05-2022)

ప్రశ్న: రోజూ వ్యాయామం చేసేవారు కూడా ఆహార విషయంలో జాగ్రత్తలు పాటించాలా? లేదా కావలసిన మోతాదులో, నచ్చిన ఆహారం తినవచ్చా?


- మోక్షిత, సికింద్రాబాద్‌


డాక్టర్ సమాధానం: రోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేసినప్పుడు క్యాలరీలు కరగడం వల్ల కొంతవరకు బరువు నియంత్రణలో ఉంటుంది. కానీ, ఆహారం కేవలం క్యాలరీలు, బరువు నియంత్రించడం కోసం మాత్రమే కాదు. సరైన ఆహారం తీసుకోకపోతే పోషక లోపాలను, కొన్ని రకాల వ్యాధులను కూడా ఆహ్వానించినట్టే. సమతులాహారంలో మనకు కావలసిన శక్తిని, క్యాలరీలనిచ్చే పదార్థాలతోపాటు శరీరంలోని రకరకాల వ్యవస్థల పనితీరును సక్రమంగా ఉంచే విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు, పీచుపదార్థాలు మొదలైనవి కూడా ఉంటాయి. ఆరోగ్యకరమైన ఆహారానికి ప్రత్యామ్నాయంగా జంక్‌ ఫుడ్స్‌, ఫాస్ట్‌ఫుడ్స్‌ తీసుకున్నప్పుడు రోజువారీ శారీరక వ్యాయామం చేయడం వల్ల బరువు పెరగకపోయినా కాలేయంపై కొవ్వు పేరుకోవడం (ఫ్యాటీ లివర్‌), పొట్ట చుట్టూ కొవ్వు పేరుకోవడం (విసరల్‌ ఫ్యాట్‌), రక్తంలో చెడు కొలెస్ట్రాల్‌ నియంత్రణలో లేకపోవడం, గుండె జబ్బులు వచ్చే అవకాశం పెరగడం మొదలైన పరిణామాలు ఉంటాయి. సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండాలంటే ఏ వయసువారైనా ఆహారం, శారీరక శ్రమ, నిద్ర ఈ మూడింటిపైనా శ్రద్ధపెట్టాలి. 


డా. లహరి సూరపనేని

న్యూట్రిషనిస్ట్, వెల్‌నెస్ కన్సల్టెంట్

nutrifulyou.com(పాఠకులు తమ సందేహాలను

sunday.aj@gmail.comకు పంపవచ్చు)

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!