ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

remedies for anxiety: ఆందోళనను తగ్గించే ఆయుర్వేద ఔషధాలు..ఇవే

ABN, First Publish Date - 2022-11-07T10:27:51+05:30

ఆందోళన తరచుగా కారణం లేకుండా కూడా వస్తూ ఉంటుంది. అయితే దీనిని తగ్గించేందుకు ఆయుర్వేదంలో చక్కని పరిష్కారాలు ఉన్నాయి.

ayurvedic medicine
అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

మనలో చాలామందికి ఆందోళన చెందడం అనేది సాధారణంగా కనిపించే లక్షణమే కావచ్చు కానీ ఇది మరీ తీవ్రమై ఒత్తిడి, అసౌకర్యానికి గురి అయ్యేలా చేస్తే కనుక దానిని ఆయుర్వేదంతో తగ్గించవచ్చు. ఈ ఆందోళన తరచుగా కారణం లేకుండా కూడా వస్తూ ఉంటుంది. అయితే దీనిని తగ్గించేందుకు ఆయుర్వేదంలో చక్కని పరిష్కారాలు ఉన్నాయి.

ఆందోళన లక్షణాలు..

మైకము: ఆందోళనతో బాధపడుతున్న వ్యక్తి కొన్నిసార్లు మూర్ఛతో బాధపడవచ్చు. దీనితో బలహీనంగా, ఏమీ చేయలేని ఫీల్ కలిగిస్తుంది. దీనితో అలసట ఉంటుంది.

చెమట పడుతుంది : ఆందోళనతో బాధపడుతున్నప్పుడు చాలా చెమట పూస్తూ ఉంటుంది. నోరు ఎండిపోతూ ఉంటుంది. తరచూ శరీరంలో డిహైడ్రేషన్ కు దారితీస్తుంది. కొన్ని సమయాల్లో చలి , ఆవిర్లు కూడా ఉంటాయి. ఈ లక్షణాలను నియంత్రించడం చాలా కష్టం అవుతుంది.

ఆందోళన లేదా భయం: చాలా విషయాల గురించి అతిగా ఆలోచించడం కూడా ఆందోళకు దారితీస్తుంది. ఏడుపు, దుఃఖం, భయము, విశ్రాంతి లేకపోవడం ఎందుకు జరుగుతుందో నిజంగా అర్థం కాలేదు. ఇది కూడా ఆందోళన రుగ్మత అతిపెద్ద లక్షణం.

1. ఆందోళన చెందితున్న వారు తలకు నూనెను ఎక్కువగా ఉపయోగించాలి.

2. అశ్వగంధ ఆందోళనను తగ్గించడంలో ఉపయోగపడుతుంది.

3. బ్రాహ్మి ఆందోళనను తగ్గించే మరో ఔషదం. ఇది శరీరంలోని కార్టిసాల్ ( స్ట్రెస్ హర్మోన్) స్థాయిని తగ్గించడంలో సహాయపడుతుంది. అంతేకాదు ఇది ఏకాగ్రతను మెరుగుపరుస్తుంది. మెదడు కణాలను పునరుజ్జీవించేలా చేస్తుంది.

4. తరచూ ఒంటె భంగిమలో కూర్చోవడం కూడా ఒత్తిడిని తగ్గిస్తుంది.

5. మండూకపర్ణి, బ్రహ్మి, అశ్వగంధ, యష్టిమధు, జటామంసి, ఉసిరి వంటి మూలికలు ఆందోళనను తగ్గించి, శరీరానికి, మనసుకు విశ్రాంతినిస్తాయి. నిద్ర పట్టడంలో ఇబ్బంది ఉన్నట్లయితే, క్షీరబల తైలంతో పాద మర్దన చేస్తే చక్కగా నిద్రపోతారు; మానసమిత్రావతకం వంటి మూలికా ఔషధాలు మానసిక ప్రశాంతతను పొందడంలో సహాయపడతాయి.

6. ఆయుర్వేదం మనస్సు, శరీరం ఒకదానితో ఒకటి అల్లిన భావన కలిగిస్తుంది. మనస్సును, శరీరాన్ని ప్రభావితం చేస్తుంది. శరీరాన్ని జాగ్రత్తగా చూసుకోవడం ఎంత ముఖ్యమో మీ మనస్సును జాగ్రత్తగా చూసుకోవడం కూడా అంతే ముఖ్యం.

Updated Date - 2022-11-07T11:08:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!