TRS : టీఆర్‌ఎస్‌ మెజారిటీకి.. ఆ 3 గుర్తులతో గండి..!

ABN , First Publish Date - 2022-11-07T04:43:25+05:30 IST

మునుగోడు ఉప ఎన్నికలో కారును పోలిన గుర్తులు టీఆర్‌ఎస్‌ మెజారిటీకి గండి కొట్టాయా? ముందు నుంచి టీఆర్‌ఎస్‌ వ్యక్తం చేసిన ఆందోళనే

TRS : టీఆర్‌ఎస్‌ మెజారిటీకి.. ఆ 3 గుర్తులతో గండి..!
TRS Party

కారును పోలిన గుర్తుతో స్వతంత్రులకు 6,551 ఓట్లు

నల్లగొండ/హైదరాబాద్‌, నవంబరు 6 (ఆంధ్రజ్యోతి): మునుగోడు ఉప ఎన్నికలో కారును పోలిన గుర్తులు టీఆర్‌ఎస్‌ మెజారిటీకి గండి కొట్టాయా? ముందు నుంచి టీఆర్‌ఎస్‌ వ్యక్తం చేసిన ఆందోళనే నిజమైందా? ఈ ప్రశ్నలకు అధికార పార్టీ నేతలు, విశ్లేషకులు అవుననే చెబుతున్నారు. ముగ్గురు స్వతంత్ర అభ్యర్థులకు ఎన్నికల కమిషన్‌(ఈసీ) కారును పోలిన గుర్తులు కేటాయించింది. ఆ ముగ్గురు స్వతంత్రులకు 6,551 ఓట్లు పోలయ్యాయి. దీంతో టీఆర్‌ఎస్‌ మెజారిటీకి గండిపడిందని ఆ పార్టీ నేతలు అంటున్నారు. మారమోని శ్రీశైలం యాదవ్‌ అనే స్వతంత్ర అభ్యర్థికి రోటీమేకర్‌ గుర్తును కేటాయించగా.. అది కారును పోలి ఉంది. ఈయనకు 2,407 ఓట్లు వచ్చాయి. యుగ తులసి పార్టీ అభ్యర్థి కె.శివకుమార్‌(రోడ్‌ రోలర్‌ గుర్తు)కు 1,874 ఓట్లు.. దళిత శక్తి ప్రోగ్రాం అభ్యర్థి ఏర్పుల గాలయ్య(చెప్పుల గుర్తు)కు 2,270 ఓట్లు వచ్చాయి. రోటీమేకర్‌, రోడ్‌రోలర్‌ గుర్తులు మొదటి ఈవీఎంలో ఉన్నాయి. మొదటి ఈవీఎంలో రెండో గుర్తు టీఆర్‌ఎ్‌సది కాగా.. రెండో ఈవీఎంలో రెండో గుర్తు ఏర్పుల గాలయ్యది.

Updated Date - 2022-11-07T04:43:25+05:30 IST

Read more