BJP: ఆదరణ ఉన్నా.. అభ్యర్థులేరీ?
ABN , First Publish Date - 2022-11-07T04:36:07+05:30 IST
రాష్ట్రంలో బీజేపీకి క్రమక్రమంగా ఆదరణ పెరుగుతున్నా.. రాష్ట్రవ్యాప్తంగా చాలా నియోజకవర్గాల్లో ఆ పార్టీకి బలమైన అభ్యర్థులు లేరన్న అభిప్రాయం ఉంది.
119 స్థానాలకుగాను.. 20-25 చోట్ల
మాత్రమే బీజేపీకి చెప్పుకోదగ్గ నాయకులు
హైదరాబాద్, నవంబరు 6 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో బీజేపీకి క్రమక్రమంగా ఆదరణ పెరుగుతున్నా.. రాష్ట్రవ్యాప్తంగా చాలా నియోజకవర్గాల్లో ఆ పార్టీకి బలమైన అభ్యర్థులు లేరన్న అభిప్రాయం ఉంది. ‘‘రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాలకుగాను 20-25 నియోజకవర్గాల్లో మాత్రమే మా పార్టీకి చెప్పుకోదగ్గ నాయకులు ఉన్నరు.. మిగతా సెగ్మెంట్లలో ఇతర పార్టీల నుంచి రావాల్సిందే’’ అని పార్టీ ముఖ్యనేత ఒకరు చెప్పారు. టీఆర్‌ఎస్‌పై వ్యతిరేకంగా ఉన్న ఓటర్లు ప్రత్యామ్నాయంగా తమను ఆదరిస్తున్నా బలమైన నాయకత్వం లేకపోవడం పెద్ద లోపమని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో మెజారిటీ నియోజకవర్గాల్లో బలమైన అభ్యర్థుల కోసం కమలనాథులు అన్వేషిస్తున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తామే గెలిచి, అధికారంలోకి రాబోతున్నామనే ప్రచారాన్ని విస్తృతంగా చేస్తూనే.. సంస్థాగతంగా బలపడాలన్న పట్టుదలతో ఉన్నారు. పలు ప్రాంతాల్లో టీఆర్‌ఎ్‌సను ఢీకొట్టే గట్టి నాయకత్వం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. అలాగే.. రాష్ట్రంలో కుటుంబపాలన వ్యతిరేక నినాదాన్ని మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని బీజేపీ భావిస్తోంది.
Read more

