KA Paul : కేఏ పాల్‌కు 805.. నోటాకు 482 ఓట్లు

ABN , First Publish Date - 2022-11-07T04:54:08+05:30 IST

మునుగోడులో ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు కేఏ పాల్‌కు 805 ఓట్లు వచ్చాయి. ఈ ఎన్నికలో ఆయన గుర్తు ఉంగరం.

KA Paul : కేఏ పాల్‌కు 805..  నోటాకు 482 ఓట్లు

నల్లగొండ, నవంబరు 6 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): మునుగోడులో ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు కేఏ పాల్‌కు 805 ఓట్లు వచ్చాయి. ఈ ఎన్నికలో ఆయన గుర్తు ఉంగరం. మునుగోడులో తన మార్కు ప్రచారంతో ప్రజలను ఆకట్టుకోవడానికి పాల్‌ ఎంతగానో ప్రయత్నించారు. తనకు 50వేల ఓట్ల మెజారిటీ వస్తుందని, తదుపరి సీఎం తనే అని చెప్పుకొచ్చారు. ఆయన చర్యలు, వ్యాఖ్యలు బాగా వైరల్‌ అయ్యాయి. ఆదివారం కూడా ప్రెస్‌మీట్‌ ఏర్పాటు చేసి.. ‘నాకు ఇంత తక్కువ ఓట్లు రావడం ఆశ్చర్యంగా ఉంది’ అన్నారు. కాగా, ఈ ఎన్నికలో నోటాకు 482 ఓట్లు పడ్డాయి. ప్రధాన పార్టీలు భారీగా డబ్బు పంచడం వల్లే నోటాకు పెద్దగా ఓట్లు పడలేదన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

Updated Date - 2022-11-07T07:49:27+05:30 IST

Read more