Read India Celebration 2022 (ఇంటర్నేషనల్): పాఠకుల కోసం ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్స్‌కు ఆహ్వానం
ABN , First Publish Date - 2022-05-10T00:11:43+05:30 IST
‘చదువు లేకపోతే విజయమూ లేదు’ అనే నినాదంతో విద్యార్థుల్లో స్వతంత్ర ఆలోచనలు రేకెత్తించే ఉద్దేశంతో రీడ్ ఇండియా సెలబ్రేషన్ 2022 కార్యక్రమం జరుగుతోంది. ఈ కార్యక్రమంలో పాల్గొనాలనుకునే

హైదరాబాద్: ‘చదువు లేకపోతే విజయమూ లేదు’ అనే నినాదంతో విద్యార్థుల్లో స్వతంత్ర ఆలోచనలు రేకెత్తించే ఉద్దేశంతో రీడ్ ఇండియా సెలబ్రేషన్ 2022 కార్యక్రమం జరుగుతోంది. ఈ కార్యక్రమంలో పాల్గొనాలనుకునే పాఠశాల/కాలేజీ విద్యార్థుల కోసం మే 08, 2022 నుంచి దరఖాస్తులు ప్రారంభమయ్యాయి. www.readinida.info వెబ్‌సైట్ ద్వారా ఔత్సాహికులు తమ పేరును నమోదు చేసుకోవచ్చు. 100 రోజుల్లో 100 కోట్ల మంది పాఠకులే లక్ష్యంగా జరుగుతున్న read india celebration 2022 ప్రోగ్రామ్‌కు ప్రతిపాదిత అంశంగా ‘రీడ్, థింక్, యాక్ట్(చదవడం, ఆలోచించడం, ఆచరించడం)’ను తీసుకున్నారు.
అయితే కేవలం ఈ అంశం మాత్రమే కాకుండా ఔత్సహికులు తమకు ఇష్టమైన అంశాన్ని తీసుకుని ఈ కార్యక్రమంలో పాల్గొన వచ్చని నిర్వాహకులు చెబుతున్నారు. అయితే అభ్యర్థులు తాము ఎంచుకున్న నేపథ్యం మీద డాక్యుమెంట్, ఒక వీడియోను రూపొందించి వెబ్‌సైట్‌లో సూచించిన విధంగా అప్లోడ్ చేయాల్సి ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమానికి డాక్టర్ ప్రదీప్ రమణ్ చర్ల (ప్రొఫెసర్ అండ్ రిజిస్టర్,ఐఐఐటీ హైదరాబాద్) మెంటర్‌గా వ్యవహరిస్తున్నట్లు పేర్కొన్నారు. పలు దశల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించి.. విజేతలను ప్రకటించనున్నట్లు చెప్పారు. విజేతలకు మంచి బహుమతులు కూడా ఉంటాయని ప్రకటనలో పేర్కొన్నారు. అంతేకాకుండా మరింత సమాచారం కోసం +91 8688 120 864 లేదా 9441 456 061 లేదా readindiacelebration2022@gmail.com ద్వారా తమను సంప్రదించాలని సూచించారు.
ఆర్‌ఐసీ 2022 కోసం టైమ్ లైన్స్:
1. స్టూడెంట్ రిజిస్ట్రేషన్స్ – మే 8 న ప్రారంభమయ్యాయి. ఆగస్టు 15,2022 న ముగుస్తాయి.
2. స్టూడెంట్ దరఖాస్తులు పంపడం – మే 25 నుంచి ఆగస్టు 15,2022 వరకూ
3. మొదటి దశ పరిశీలన – సెప్టెంబర్ మరియు అక్టోబర్ 2022
4. రెండవ దశ కోసం లీడర్‌షిప్ కోచింగ్ సెషన్ – క్వాలిఫయర్లు కోసం – నవంబర్ 2022
5. రౌండ్ 2 స్ర్కీనింగ్ – నవంబర్ 2022
6. గ్రాండ్ ఫైనల్ –డిసెంబర్ 2022 రెండు లేదా మూడవ వారం
ప్రతి విభాగంలోనూ విజేతలకు అందించే అవార్డులు:
1. విభాగం1 – మూడు నుంచి ఐదు తరగతులు – మొదటి బహుమతి– ల్యాప్‌టాప్ ; 2 వ బహుమతి – టాబ్లెట్+ ప్రైజ్‌మనీ
2. విభాగం 2 – ఆరు నుంచి 9 తరగతులు – మొదటి బహుమతి– ల్యాప్‌టాప్ ; 2 వ బహుమతి – టాబ్లెట్+ ప్రైజ్‌మనీ
3. విభాగం3 – 10 నుంచి 12 తరగతులు – మొదటి బహుమతి– ల్యాప్‌టాప్ ; 2 వ బహుమతి – టాబ్లెట్+ ప్రైజ్‌మనీ
4. విభాగం4 – అండర్ గ్రాడ్యుయేట్ మరియు గ్రాడ్యుయేట్ – మొదటి బహుమతి– ల్యాప్‌టాప్ ; 2 వ బహుమతి – టాబ్లెట్+ ప్రైజ్‌మనీ
5. విభాగం5 – సిటిజన్స్ (వర్కింగ్ మరియు రిటైర్డ్) – మొదటి బహుమతి– ల్యాప్‌టాప్ ; 2 వ బహుమతి – టాబ్లెట్+ ప్రైజ్‌మనీ