ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

ఇంటర్‌ బోర్డు మరో తప్పిదం..! తెలుగు, ఇంగ్లీషు మీడియం ప్రశ్నల్లో తేడాలు

ABN, First Publish Date - 2022-05-13T16:52:24+05:30

ఇంటర్మీడియట్‌ వార్షిక పరీక్షల నిర్వహణలో మరో పొరపాటు చోటుచేసుకుంది. గురువారం జరిగిన ద్వితీయ సంవత్సరం పొలిటికల్‌ సైన్స్‌ పరీక్షలో... తెలుగు మీడియం, ఇంగ్లీషు మీడియం విద్యార్థులకు ఓ ప్రశ్న వేర్వేరుగా వచ్చింది. ప్రశ్నపత్రంలోని ..

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

పొలిటికల్‌ సైన్స్‌ పేపర్‌-2లో పొరపాటు

వేర్వేరుగా వాల్యుయేషన్‌ చేస్తాం: బోర్డు వివరణ


హైదరాబాద్‌, మే 12 (ఆంధ్రజ్యోతి): ఇంటర్మీడియట్‌ వార్షిక పరీక్షల(Intermediate‌ Annual Examinations) నిర్వహణలో మరో పొరపాటు చోటుచేసుకుంది. గురువారం జరిగిన ద్వితీయ సంవత్సరం పొలిటికల్‌ సైన్స్‌(Political Science) పరీక్షలో... తెలుగు మీడియం, ఇంగ్లీషు మీడియం విద్యార్థులకు ఓ ప్రశ్న వేర్వేరుగా వచ్చింది. ప్రశ్నపత్రంలోని సెక్షన్‌-బి, ప్రశ్న నంబరు-8లో... ఇంగ్లీషు మీడియం పేపర్‌లో ‘1947 భారత స్వాతంత్య్ర చట్టంలోని ముఖ్యాంశాలు రాయండి’ అనే ప్రశ్న ఇచ్చారు. అయితే తెలుగు మీడియం ప్రశ్నపత్రంలో ఈ ప్రశ్న స్థానంలో.... ‘భారత స్వాతంత్య్ర పోరాటంలో హోంరూల్‌ ఉద్యమాన్ని వర్ణించండి’ అని పేర్కొన్నారు. ఈ ప్రశ్నకు 5 మార్కులు కేటాయించారు. ఇలా తెలుగులో ఒక ప్రశ్నను, ఇంగ్లీషు మీడియంలో మరో ప్రశ్నను ఇవ్వడం ద్వారా విద్యార్థులు నష్టపోతారని ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ విషయంపై అధికారులు స్పందించారు. ఇంగ్లీషు, తెలుగు మీడియం పేపర్లను విడివిడిగా మూల్యాంకనం చేస్తామని, విద్యార్థులకు ఎలాంటి నష్టం జరగదని బోర్డు కార్యదర్శి ప్రకటించారు. కాగా... గురువారం ఇంటర్‌ పరీక్షలకు సుమారు 95.1 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారు. మొత్తం 4,39,171 మంది హాజరవ్వాల్సి ఉండగా, 4,17,295 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. మిగతా 21,876 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. అలాగే గురువారం రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 12 మాల్‌ ప్రాక్టీస్‌ కేసులను నమోదుచేశారు. 

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!