-
-
Home » Education » Employment » notification for replacement of posts in telangana electricity department spl-MRGS-Education
-
విద్యుత్ శాఖలో 1271 కొలువులు.. రేపట్నుంచే ప్రక్రియ ప్రారంభం
ABN , First Publish Date - 2022-05-10T18:15:37+05:30 IST
దక్షిణ డిస్కమ్(Southern Discom) (హైదరాబాద్)లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలయింది. 70 అసిస్టెంట్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్), 201 సబ్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్), 1000 జూనియర్ లైన్‌మ్యాన్ (జేఎల్‌ఎం) పోస్టుల భర్తీ కోసం..

భర్తీకి దక్షిణ డిస్కమ్ నోటిఫికేషన్
హైదరాబాద్, మే 9 (ఆంధ్రజ్యోతి): దక్షిణ డిస్కమ్(Southern Discom) (హైదరాబాద్)లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలయింది. 70 అసిస్టెంట్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్), 201 సబ్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్), 1000 జూనియర్ లైన్‌మ్యాన్ (జేఎల్‌ఎం) పోస్టుల భర్తీ కోసం ఎస్పీడీసీఎల్(SPDCL) సోమవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో బీటెక్ చేసిన వారు ఏఈ (ఎలక్ట్రికల్) పోస్టులకు అర్హులు కాగా... సబ్ ఇంజనీర్ పోస్టులకు పాలిటెక్నిక్‌లో ఎలక్ట్రికల్ డిప్లొమా చేసిన వారు అర్హులు. ఇక జూనియర్ లైన్‌మ్యాన్(జేఎల్‌ఎం) ఉద్యోగాలకు ఐటీఐ (ఎలక్ట్రికల్) చేసిన వారు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంది. సమగ్ర వివరాల కోసం ఈనెల 11వ తేదీ తర్వాత www.tssouthpower. com, http://tssouthpower.cgg.gov.in, https://tssouthernpower.cgg. gov.in/TSSPDCLWEB20/#!/home15erftg5896.rps అనే వెబ్‌సైట్‌లను సంప్రదించవచ్చు.