NPTIలో పీజీడీసీ

ABN , First Publish Date - 2022-05-14T19:46:25+05:30 IST

బెంగళూరులోని నేషనల్‌ పవర్‌ ట్రెయినింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌(National Power Training Institute)(ఎన్‌పీటీఐ) - పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ డిప్లొమా కోర్సు(పీజీడీసీ)లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. ఇందులో స్పెషలైజేషన్‌ ‘ట్రాన్స్‌మిషన్‌ అండ్‌ డిస్ట్రిబ్యూషన్‌ సిస్టమ్స్‌’. ప్రోగ్రామ్‌ వ్యవధి 26 వారాలు....

NPTIలో పీజీడీసీ

బెంగళూరులోని నేషనల్‌ పవర్‌ ట్రెయినింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌(National Power Training Institute)(ఎన్‌పీటీఐ) - పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ డిప్లొమా కోర్సు(పీజీడీసీ)లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. ఇందులో స్పెషలైజేషన్‌ ‘ట్రాన్స్‌మిషన్‌ అండ్‌ డిస్ట్రిబ్యూషన్‌ సిస్టమ్స్‌’. ప్రోగ్రామ్‌ వ్యవధి 26 వారాలు. ఇందులో ఆపరేషన్‌ అండ్‌ మెయింటెనెన్స్‌ ఆఫ్‌ ట్రాన్స్‌మిషన్‌ అండ్‌ డిస్ట్రిబ్యూషన్‌ సిస్టమ్స్‌, సేఫ్టీ అండ్‌ ఎలక్ట్రిక్‌ సప్లయ్‌ రెగ్యులేషన్స్‌ సంబంధిత అంశాలు నేర్పిస్తారు. ప్రోగ్రామ్‌లో భాగంగా 60 శాతం థియరీ సెషన్స్‌, 40 శాతం ప్రాక్టికల్‌ సెషన్స్‌ ఉంటాయి. పవర్‌ ఇండస్ట్రీకి సంబంధించి ప్రాథమిక అంశాలపై టెక్నికల్‌, ప్రొఫెషనల్‌ పరిజ్ఞానాన్ని అందిస్తారు. అకడమిక్‌ ప్రతిభ ఆధారంగా అడ్మిషన్స్‌ ఇస్తారు. ఈ ప్రోగ్రామ్‌లో మొత్తం 60 సీట్లు ఉన్నాయి. స్పాన్సర్డ్‌ అభ్యర్థులకు 25 శాతం సీట్లు కేటాయించారు. ప్రభుత్వ నిబంధనల మేరకు రిజర్వేషన్‌లు వర్తిస్తాయి. 

అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బీఈ(ఎలక్ట్రికల్‌/ ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ / పవర్‌ ఇంజనీరింగ్‌) ఉత్తీర్ణులై ఉండాలి. వయోపరిమితి నిబంధనలు లేవు.


ముఖ్య సమాచారం

దరఖాస్తు సబ్మిషన్‌కు చివరి తేదీ: జూన్‌ 22 

దరఖాస్తుకు జతచేయాల్సిన పత్రాలు: పదోతరగతి, ఇంటర్‌, ఇంజనీరింగ్‌ డిగ్రీ సర్టిఫికెట్‌లు, మార్కుల పత్రాలు; అనుభవానికి సంబంధించిన ధృవీకరణ పత్రాలు; రెండు ఫొటోలు 

వెబ్‌సైట్‌: www.nptibangalore.in

Read more