RIE మైసూరులో బీఈడీ, ఎంఈడీ
ABN , First Publish Date - 2022-05-14T18:42:18+05:30 IST
నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రిసెర్చ్ అండ్ ట్రెయినింగ్ (ఎన్సీఈఆర్టీ) ఆధ్వర్యంలోని రీజినల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ (ఆర్ఐఈ), మైసూరు - బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్, మాస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్‌లలో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇంటిగ్రేటెడ్...
నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రిసెర్చ్ అండ్ ట్రెయినింగ్( National Council of Educational Research and Training) (ఎన్సీఈఆర్టీ) ఆధ్వర్యంలోని రీజినల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ (ఆర్ఐఈ), మైసూరు - బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్, మాస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్‌లలో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్‌లలో బీఎస్సీ బీఈడీ, బీఏ బీఈడీ, ఎమ్మెస్సీఈడీ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఈ ప్రోగ్రామ్లన్నింటికీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా కర్ణాటక, కేరళ, తమిళనాడు, పుదుచ్చెరీ లక్షద్వీప్ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎమ్మెస్సీఈడీ ప్రోగ్రామ్‌నకు దేశవ్యాప్తంగా అభ్యర్థులు అప్లయ్ చేసుకోవచ్చు. కామన్ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్ (సీఈఈ) 2022 ద్వారా అడ్మిషన్స్ ఇస్తారు.
బీఎస్సీ బీఈడీ
ఇది నాలుగేళ్ల వ్యవధి గల ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్. ఫిజిక్స్, కెమిస్ట్రీ, మేథమెటిక్స్ (పీసీఎం స్ట్రీమ్); ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ/ బయోటెక్నాలజీ లేదా కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ (సీబీజడ్ స్ట్రీమ్)తో ఇంటర్/ పన్నెండోతరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ద్వితీయ శ్రేణి మార్కులు ఉండాలి. స్ట్రీమ్‌కు 44 చొప్పున మొత్తం 88 సీట్లు ఉన్నాయి. ఒక్కో స్ట్రీమ్‌లో తెలంగాణకు 5, ఆంధ్రప్రదేశ్‌కు 7 సీట్లు కేటాయించారు.
బీఏ బీఈడీ
ఇది కూడా నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామే. ఆర్ట్స్/ కామర్స్/ సైన్స్ స్ట్రీమ్‌తో ఇంటర్/ పన్నెండోతరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. కనీసం 50 శాతం మార్కులు ఉండాలి. మొత్తం 44 సీట్లు ఉన్నాయి. తెలంగాణకు 5, ఆంధ్రప్రదేశ్‌కు 7 సీట్లు ప్రత్యేకించారు.
బీఈడీ
ప్రోగ్రామ్ వ్యవధి రెండేళ్లు. సైన్స్ అండ్ మేథ్స్, ఇంగ్లీష్ అండ్ సోషల్ సైన్స్ స్పెషలైజేషన్లతో ప్రోగ్రామ్ అందుబాటులో ఉంది. కనీసం 50 శాతం మార్కులతో బీఏ/ బీఎస్సీ/ ఎంఏ/ ఎమ్మెస్సీ ఉత్తీర్ణులు అప్లయ్ చేసుకోవచ్చు. మొత్తం 55 సీట్లు ఉన్నాయి. తెలంగాణకు 7, ఆంధ్రప్రదేశ్‌కు 8 సీట్లు కేటాయించారు.
ఎంఈడీ
ప్రోగ్రామ్ వ్యవధి రెండేళ్లు. ద్వితీయ శ్రేణి మార్కులతో డిగ్రీ (ఆర్ట్స్/ సైన్స్) ఉత్తీర్ణతతోపాటు బీఈడీ/ బీఏఈడీ/ బీఎస్సీఈడీ పూర్తిచేసి ఉండాలి. మొత్తం 35 సీట్లు ఉన్నాయి. తెలంగాణకు 4, ఆంధ్రప్రదేశ్‌కు 6 సీట్లు కేటాయించారు.
ఎమ్మెస్సీఈడీ
ఇది ఆరేళ్ల వ్యవధిగల ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్. ఫిజిక్స్, కెమిస్ట్రీ, మేథమెటిక్స్ స్పెషలైజేషన్లు అందుబాటులో ఉన్నాయి. ఎంపీసీ (మేథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ) గ్రూప్‌తో ఇంటర్/ పన్నెండోతరగతి ఉత్తీర్ణులైనవారు దరఖాస్తు చేసుకోవచ్చు ద్వితీయ శ్రేణి మార్కులు తప్పనిసరి. స్పెషలైజేషన్‌కు 18 సీట్లు ఉన్నాయి.
సీఈఈ 2022
పరీక్ష సమయం రెండు గంటలు. మొత్తం 80 ఆబ్జెక్టివ్ ప్రశ్నలు ఇస్తారు. లాంగ్వేజ్ ప్రొఫిషియెన్సీ ఇన్ ఇంగ్లీష్ నుంచి 20, టీచింగ్ ఆప్టిట్యూడ్/ ఆటిట్యూడ్ నుంచి 30, రీజనింగ్ ఎబిలిటీ నుంచి 30 ప్రశ్నలు అడుగుతారు. ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్‌లకు ఇంటర్ స్థాయిలో; డిగ్రీ, పీజీ లెవెల్ ప్రోగ్రామ్‌లకు డిగ్రీ స్థాయిలో ప్రశ్నలు ఇస్తారు. ఒక్కో ప్రశ్నకు రెండు మార్కులు నిర్దేశించారు. తప్పుగా గుర్తించిన సమాధానానికి అరమార్కు కోత విధిస్తారు. ప్రశ్నపత్రం ఇంగ్లీష్, హిందీ మాధ్యమాల్లో ఉంటుంది.
ముఖ్య సమాచారం
ప్రోగ్రామ్‌ను అనుసరించి ఇంటర్/ డిగ్రీ పరీక్షలను 2020, 2021లో పూర్తిచేసినవారు; 2022లో రాసేవారు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: జూన్ 30
అడ్మిట్ కార్డ్‌ల డౌన్లోడింగ్: జూలై 15 నుంచి
తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, విజయవాడ
సీఈఈ 2022 తేదీ: జూలై 24
ఫలితాలు విడుదల: బీఎస్సీ బీఈడీ, బీఏ బీఈడీ, ఎమ్మెస్సీఈడీ ప్రోగ్రామ్‌లకు ఆగస్టు 1న; బీఈడీ, ఎంఈడీ ప్రోగ్రామ్‌లకు ఆగస్టు 5న
వెబ్సైట్: https://cee.ncert.gov.in

