IIT BHILAIలో పీహెచ్‌డీ

ABN , First Publish Date - 2022-05-14T19:23:50+05:30 IST

భిలాయ్‌లోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఐఐటీ) - పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. రెగ్యులర్‌, స్పాన్సర్డ్‌ విధానాల్లో ప్రోగ్రామ్‌ అందుబాటులో ఉంది. ఎంట్రెన్స్‌ టెస్ట్‌, ఇంటర్వ్యూల ద్వారా అడ్మిషన్స్‌ ఇస్తారు...

IIT BHILAIలో పీహెచ్‌డీ

భిలాయ్‌లోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఐఐటీ) - పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. రెగ్యులర్‌, స్పాన్సర్డ్‌ విధానాల్లో ప్రోగ్రామ్‌ అందుబాటులో ఉంది. ఎంట్రెన్స్‌ టెస్ట్‌, ఇంటర్వ్యూల ద్వారా అడ్మిషన్స్‌ ఇస్తారు.

విభాగాలు: కెమిస్ట్రీ, కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజనీరింగ్‌, డేటా సైన్స్‌ అండ్‌ ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌, ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌, ఎలక్ట్రిక్‌ వెహికిల్‌ టెక్నాలజీ, లిబరల్‌ ఆర్ట్స్‌, మేథమెటిక్స్‌, మెకానికల్‌ ఇంజనీరింగ్‌, మెకట్రానిక్స్‌, ఫిజిక్స్‌  

అర్హత: ప్రథమ శ్రేణి మార్కులతో ఇంజనీరింగ్‌/ టెక్నాలజీ విభాగాల్లో బ్యాచిలర్స్‌ డిగ్రీ/ మాస్టర్స్‌ డిగ్రీ పూర్తిచేసి ఉండాలి. మాస్టర్స్‌ (సైన్స్‌/ ఆర్ట్స్‌/సోషల్‌ సైన్సెస్‌) ఉత్తీర్ణులైన అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. కనీసం రెండేళ్ల ప్రొఫెషనల్‌ అనుభవం ఉండాలి. గేట్‌ వ్యాలిడ్‌ స్కోర్‌/ (యూజీసీ నెట్‌/ సీఎ్‌సఐఆర్‌ నెట్‌)(జేఆర్‌ఎఫ్‌/ ఎల్‌ఎస్‌) అర్హత ఉండాలి. లేదా ఎన్‌బీహెచ్‌ఎం/ డీబీటీ/ ఐకార్‌/ ఐసీఎంఆర్‌/ ఐసీపీఆర్‌/ డీఏఈ/ డీ ఎస్‌టీ/ ఇన్‌స్పయిర్‌ ఫెలోషిప్‌ అర్హత ఉండాలి. ఐఐటీ సంస్థల నుంచి 8 సీజీపీఏతో బీఈ/ బీటెక్‌ పూర్తిచేసినవారికి ప్రాధాన్యం ఉంటుంది. 

ఫీజు: జనరల్‌ అభ్యర్థులకు రూ.200; దివ్యాంగులు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.100

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: మే 20 

ఎంట్రెన్స్‌ టెస్ట్‌లు, ఇంటర్వ్యూలు: కెమిస్ట్రీ, కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజనీరింగ్‌ విభాగాలకు జూన్‌ 20న; డేటా సైన్స్‌ అండ్‌ ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌, మెకానికల్‌ ఇంజనీరింగ్‌ విభాగాలకు జూన్‌ 21న; ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌, ఫిజిక్స్‌ విభాగాలకు జూన్‌ 22న; ఎలక్ట్రికల్‌ వెహికిల్‌ టెక్నాలజీ, లిబరల్‌ ఆర్ట్స్‌ విభాగాలకు జూన్‌ 23న; మేథమెటిక్స్‌, మెకట్రానిక్స్‌ విభాగాలకు జూన్‌ 24న

వెబ్‌సైట్‌: iitbhilai.ac.in

Read more