Group-1 పోస్టులకు 84,757 దరఖాస్తులు
ABN , First Publish Date - 2022-05-13T21:51:05+05:30 IST
గ్రూపు-1( Group-1 ) పోస్టుల కోసం గురువారం నాటికి 84,757 మంది దరఖాస్తు చేసుకున్నారు. 503 గ్రూప్-1 ఉద్యోగాల భర్తీకి తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీసు కమిషన్(Telangana State Public Service Commission) నోటిఫికేషన్ జారీ చేసిన విషయం
హైదరాబాద్, మే 12 (ఆంధ్రజ్యోతి) : గ్రూపు-1( Group-1 ) పోస్టుల కోసం గురువారం నాటికి 84,757 మంది దరఖాస్తు చేసుకున్నారు. 503 గ్రూప్-1 ఉద్యోగాల భర్తీకి తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీసు కమిషన్(Telangana State Public Service Commission) నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. కాగా, ఇప్పటిదాకా సుమారు 3,15,539 మంది అభ్యర్థులు ఓటీఆర్‌లో వివరాలు నమోదు చేసుకున్నారు. ఇందులో కొత్తవారు 1,01,569 మంది ఉన్నారు. గతంలోనే ఓటీఆర్ చేసుకున్న వారిలో 2,13,970 మంది ఎడిట్ ఆప్షన్‌ను సద్వినియోగం చేసుకున్నారు.