పాట మానవ జీవితంతో అవిభాజ్యమైనది

ABN , First Publish Date - 2022-10-23T23:06:51+05:30 IST

తెలంగాణలో పాట లేకుండా ఏ పనీ లేదని, పాట మానవ జీవితంతో అవిభాజ్యంగా ఉందని అడిషనల్‌ కలెక్టర్‌ జీవీ శ్యాంప్రసాద్‌లాల్‌ అన్నారు.

పాట మానవ జీవితంతో అవిభాజ్యమైనది
జ్యోతి ప్రజ్వలన చేస్తున్న అదనపు కలెక్టర్‌ జీవీ శ్యాంప్రసాద్‌లాల్‌

కరీంనగర్‌ కల్చరల్‌, అక్టోబరు 23: తెలంగాణలో పాట లేకుండా ఏ పనీ లేదని, పాట మానవ జీవితంతో అవిభాజ్యంగా ఉందని అడిషనల్‌ కలెక్టర్‌ జీవీ శ్యాంప్రసాద్‌లాల్‌ అన్నారు. ఆదివారం నగరంలోని ఫిలింభవన్‌లో కిట్ల స్వరనీరాజనం సంస్థ ఆధ్వర్యంలో గాన గంధర్వుడు ఘంటసాల, స్వరధుని బాలు అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ సంతోషమైనా, దుఃఖమైనా పాట మన వెన్నంటి ఉంటుందని, అమ్మమాటకంటే ముందు లాలిపాట మనకు పరిచయం అవుతుందని, పాట మనసు సేదదీరుస్తుందని, మన మనసులను శుభ్రం చేస్తుందన్నారు. ఈ నూతన కళాకారులకు వేదికను ఏర్పాటు చేసినందుకు కిట్ల స్వర నీరాజనం సంస్థ అధ్యక్షుడు కిట్ల శ్రీనివాస్‌ను, సౌజన్యాన్ని అందించిన ఈగల్స్‌ ట్రస్టు అధ్యక్షుడు తంగడ అశోక్‌రావులను అభినందించారు. అనంతరం గాయనీ గాయకులకు మెమోంటోలను అందించి సత్కరించారు. ఈ కార్యక్రమంలో బొమ్మకల్‌ సర్పంచ్‌ పురుమల్ల శ్రీనివాస్‌, గాజోజు నాగభూషణం, నంది శ్రీనివాస్‌, గట్టురాజయ్య, వర్కోల్‌ మైసయ్య, విజయ్‌కుమార్‌, సృజన్‌, కాటబత్తిని శంకర్‌, కళాకారులు పాల్గొన్నారు.

Updated Date - 2022-10-23T23:06:51+05:30 IST
Read more