ఈ వారం కార్యక్రమాలు 07 11 2022

ABN , First Publish Date - 2022-11-07T00:53:41+05:30 IST

రొట్టమాకురేవు కవిత్వ అవార్డు కవితా సంపుటాల ఆవిష్కరణ ‘తెలుగు సామెతలు-సమగ్ర సమాలోచన’ ఆవిష్కరణ సభ...

ఈ వారం కార్యక్రమాలు 07 11 2022

రొట్టమాకురేవు కవిత్వ అవార్డు

రొట్టమాకురేవు కవిత్వ అవార్డుల సభ నవంబర్‌ 13 ఉ.10.30గం.లకు ముం తాజ్‌ కాలేజి, మలక్‌ పేట, హైదరా బాద్‌లో జరుగుతుంది. సభలో ప్రసేన్‌, కె. శివారెడ్డి, లక్ష్మీనరసయ్య గుంటూరు, వంశీకృష్ణ, కోయి కోటేశ్వరరావు తదిత రులు పాల్గొంటారు. అవార్డు గ్రహీ తలు: పసునూరు శ్రీధర్‌బాబు, వైష్ణవి శ్రీ, బిల్ల మహేందర్‌, పల్లిపట్టు నాగ రాజు. సభలో పుస్తకావిష్కరణలు, కవిత్వ పఠనం ఉంటాయి.

యాకూబ్‌

కవితా సంపుటాల ఆవిష్కరణ

మూడు భాషలలో రొక్కం కామేశ్వరరావు కవితా సంపుటాలు నవం బరు 12 సా.6గం.లకు విశాఖపట్నం పౌర గ్రంథాలయంలో ఆవిష్కృ తమవుతున్నాయి. ఈ సభలో డి.వి. సూర్యారావు, చందు సుబ్బారావు, ఎల్‌.ఆర్‌. స్వామి, వి. రాధాదేవి తదితరులు పాల్గొంటారు.

ఉప్పల అప్పలరాజు

‘తెలుగు సామెతలు-సమగ్ర సమాలోచన’ ఆవిష్కరణ సభ

వై.సత్యనారాయణ సంపాదకత్వంలో వెలువడిన ‘తెలుగు సామెతలు -సమగ్ర సమాలోచన’ గ్రంథావిష్కరణ సభ నవంబర్‌ 14 ఉ.10గం. లకు ఏ.వి. ఆర్ట్స్‌, సైన్స్‌ అండ్‌ కామర్స్‌ కళాశాల ఆడిటోరియంలో జరుగుతుంది. సభలో సుద్దాల అశోక్‌ తేజ, కె. రామచంద్రారెడ్డి, సాగి కమలాకరశర్మ, కె. గౌతమి తదితరులు పాల్గొంటారు.

తెలుగుశాఖ, ఏ.వి.కళాశాల

‘ఆకురాలిన చప్పుడు’ కవిత్వం

శ్రీ వశిష్ఠ సోమేపల్లి కవిత్వ సంపుటి ‘ఆకురాలిన చప్పుడు’ ఆవిష్కరణ సభ నవంబరు 13 ఉ.10గం.లకు ఎ.పి. కాటన్‌ అసోసియేషన్‌ మీటింగ్‌ హాల్‌, లక్ష్మిపురం మెయిన్‌రోడ్‌, గుంటూరులో జరుగుతుంది. పెనుగొండ లక్ష్మీనారాయణ, పాపినేని శివశంకర్‌ తదితరులు పాల్గొంటారు.

చలపాక ప్రకాష్‌

Updated Date - 2022-11-07T00:53:41+05:30 IST

Read more