ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆదర్శ నాయకుడు ‘కాకాని’

ABN, First Publish Date - 2022-12-23T03:57:31+05:30

ప్రజాస్వామ్యానికి పుట్టినిల్లయిన బ్రిటన్‌లో ‘‘ఓ నాయకుడు మరణించిన 30 సంవత్సరాల తరువాత కూడా గుర్తిస్తే అతడే నాయకుడు’’ అనే ఓ నానుడి ఉంది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రజాస్వామ్యానికి పుట్టినిల్లయిన బ్రిటన్‌లో ‘‘ఓ నాయకుడు మరణించిన 30 సంవత్సరాల తరువాత కూడా గుర్తిస్తే అతడే నాయకుడు’’ అనే ఓ నానుడి ఉంది. అలాంటి నాయకుడు కాకాని. కృష్ణా జిల్లా ఆకునూరు గ్రామంలో అతి సామాన్య రైతు కుటుంబంలో జన్మించి, అతి కొద్ది చదువుతోనే రాష్ట్ర రాజకీయ రంగంలో రాణించిన విశిష్ట గుణసంపన్నుడు కాకాని వెంకటరత్నం. సమాజమే దేవాలయంగా, ప్రజలే దేవుళ్లుగా భావించి అందుకు త్రికరణశుద్ధిగా శ్రమించిన నిస్వార్ధ ప్రజానాయకుడు. ఈ డిసెంబర్‌ 25కు ఆ మహనీయుడు గతించి 50 సంవత్సరాలు. కృష్ణా జిల్లాలో ఇప్పటికీ ఆయనను స్మరించుకోని గ్రామం లేదు.

కుల మతాలు రాజ్యమేలుతున్న ప్రస్తుత కాలంలో ఆత్మీయ అనుచరులను దృష్టిలో పెట్టుకుని కులాలకతీతంగా ఆయన అందరినీ కలుపుకుని పోయారు. అందరినీ సమన్వయం చేసుకుంటూ సర్వజన నాయకుడిగా పేరు పొందారు. రాజకీయ చైతన్యానికి మారుపేరయిన కృష్ణా జిల్లాలో జమీందారి, భూస్వామ్య కుటుంబాలు వ్యతిరేకించినా, సామాన్య–మధ్యతరగతి ప్రజలకు సేవ చేసి వారి మద్దతుతోనే నాయకుడు ఎదిగారాయన. జయాపజయాల్ని సమానంగా స్వీకరించి, ప్రజలతో నిరంతరం మమేకమయ్యేవారు. 1967లో జరిగిన సాధారణ ఎన్నికలలో జమీందార్లు, భూస్వామ్య కుటుంబాలు ఏకమై కాకానిని ఓడిస్తే, అదే సంవత్సరం రాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షులుగా ఆయన్ని ఎంపిక చేశారు అప్పటి ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి. కాకాని ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో 72వ అఖిలభారత కాంగ్రెస్‌ మహాసభలు విజయవంతంగా జరిగాయి. దీంతో వారి శక్తిసామర్ధ్యాలు రాష్ట్ర, జాతీయ నాయకులను ఆకర్షించాయి. ప్రతి గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలకు సహాయమందించే వారి జాబితా ఆయన వద్ద ఉండేది. వారి సహకారంతో ప్రజలకు పాఠశాలలు, వైద్యవసతులు, గ్రంథాలయాల స్థాపనకు ఆయన కృషి చేశారు.

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఉద్యమ సమయంలో 1972 డిసెంబర్‌ 25న జరిగిన పోలీసు కాల్పుల్లో మరణించిన విద్యార్థుల మృతదేహాలను చూసి చలించి, అదే రాత్రి తీవ్ర ఆవేదనతో మృతి చెందారు. విజయవాడ బెంజి సర్కిల్‌లో ఉన్న ఆ మహానాయకుడి విగ్రహాన్ని కూడా తొలగించి అగౌరవపరిచారు. ఇప్పటికైనా ఆయన స్మృతి చిహ్నంతో పాటు, తొలగించిన విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తే ఆయనకు నిజమైన నివాళి అర్పించినట్లవుతుంది.

కలపాల వినయసాగర్‌

Updated Date - 2022-12-23T03:57:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising