ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మేధావులా, పంజరంలో చిలుకలా?

ABN, First Publish Date - 2022-12-16T01:44:02+05:30

తెలంగాణ ఉద్యమకాలం నుండి ఇక్కడి మేధావులను ప్రజలు మరింత ఎక్కువ అభిమానిస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో అనేక ప్రజావ్యతిరేక చర్యలపై...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తెలంగాణ ఉద్యమకాలం నుండి ఇక్కడి మేధావులను ప్రజలు మరింత ఎక్కువ అభిమానిస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో అనేక ప్రజావ్యతిరేక చర్యలపై మేధావులు ప్రజలను చైతన్య పరిచారు. రాష్ట్ర సాధన ఉద్యమంలో వాళ్ల పాత్ర కీలకమైనది. ప్రజల ఆకాంక్షలను వీరు వ్యక్తీకరిస్తారని, నిరంకుశ పాలకులను ఎదిరించడానికి ఎలాంటి త్యాగాలకైనా వెనుకాడరని నమ్మారు. వ్యక్తిగత ప్రయోజనాలు ఏనాడు ఆశించని అలాంటి మేధావులు చాలామంది తెలంగాణలో ఉండేవాళ్లు. ఇప్పుడు స్వరాష్ట్రంలో ఆ గొప్ప సంప్రదాయానికి భిన్నంగా కొందరు మేధావులు ప్రవర్తిస్తున్నారు. తెలంగాణ వికాస సమితి ఆధ్వర్యంలో ఇటీవల ఒక సదస్సు జరిగింది. ఆ కార్యక్రమంలో పాల్గొన్న మేధావుల పట్ల తెలంగాణలో గౌరవం ఉంది. తెలంగాణ ఏర్పాటు అవసరాన్ని ప్రజలకు తెలియచెప్పే మేధో ఉద్యమానికి వాళ్లు నాయకత్వం వహించారు. రాష్ట్రం ఏర్పడితే ప్రజాస్వామ్యం, సమానత్వం, స్వేచ్ఛ ప్రజలకు అందుతాయని వాళ్లు అప్పట్లో హామీ ఇచ్చారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా ఈ మేధావులు ఉద్యమ ఆకాంక్షల సాధనకోసం ప్రజలతోనే ఉంటారని ఆశించిన వారికి ఎదురు దెబ్బ తగిలింది. రాష్ట్రం ఏర్పడగానే కొందరు మేధావులు కెసిఆర్‌ పంచన చేరారు, ఆశించిన పదవులను పొందారు, ఆ పదవుల కోసం తమను ఎంతో అభిమానించే ప్రజలను వంచించారు.

నరేంద్రమోదీ ప్రభుత్వ పాలనను విమర్శిస్తూ ఆ సదస్సులో వీరు ఆహ్లాదకరమైన ప్రసంగాలు చేశారు. కెసిఆర్‌ పాలన గురించి ఏ ఒక్క మేధావీ ఒక్క మాటా మాట్లాడలేదు. ప్రజాస్వామ్యం, లౌకికవాదం, భావప్రకటన స్వేచ్ఛ వంటి లోతైన విషయాలను చర్చిస్తూ కేసిఆర్ మెప్పు కోసం పోటీపడిన వీరంతా అవే అంశాల పట్ల కెసిఆర్‌ ప్రభుత్వం ఎట్లా వ్యవహరిస్తున్నదనే సంగతిని ప్రస్తావించలేదు. రాష్ట్రం ఏర్పడిన వెంటనే కెసిఆర్‌ తన ప్రభుత్వంలో ఉద్యమద్రోహులను నింపుకొని ప్రజాస్వామ్యాన్ని హత్య చేసిన సంగతి వీళ్లకు గుర్తుకురాలేదు. ప్రజల నిరసన హక్కును కాలరాస్తూ ధర్నాచౌక్‌ను ఎత్తివేసినప్పుడు ఈ మేధావులు నోరు విప్పుతారని జనం ఆశించారు. తెలంగాణ పాట పాడిన విమలక్క ఆఫీసును కుట్రలతో మూసేయించి రోడ్డుపాలు చేసినప్పుడు, కోదండరాం సార్ను నిర్బంధించినప్పుడు వీరు చోద్యం చూశారు. నిరంతరం ప్రజల పక్షం వహించే మందకృష్ణను జైలులో పెడితే ఒక్క మాటా మాట్లాడకుండా, రాజ్యం నీడన నిలబడ్డారు. బూటకపు ఎన్‌కౌంటర్లు జరిగినప్పుడు, ఇసుక మాఫియాను కాపాడ్డానికి దళితులను పోలీసులు హింసించినప్పుడు, పోడు భూముల్లో సాగు చేసుకుంటున్న ఆదివాసులను చెట్లకుకట్టి బాదినప్పుడు, అప్పుల ఊబిలో ఇరుక్కొని రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నప్పుడు, అభివృద్ధిపేరుతో అసైన్డ్‌ భూములను ప్రభుత్వం అన్యాయంగా లాక్కుంటున్నప్పుడు, అనేకమంది మేధావులను అరెస్టులు చేస్తూ, ప్రజాకళాకారులను ఇబ్బంది పెడుతున్నప్పుడు వీరు గొంతువిప్పలేదు. ఆర్టిసి ఉద్యోగులను ముప్పుతిప్పలు పెట్టి, ఆత్మహత్యలకు పురిగొల్పినప్పుడు, విఆర్ఓలను రోడ్డుపాలు చేసినప్పుడు వీళ్లు ప్రేక్షకపాత్ర పోషించారు. ఇలాంటి అనేక సందర్భాలలో వీళ్లు న్యాయం మాట్లాడుతారని, కెసిఆర్‌ నిరంకుశత్వాన్ని నిలదీస్తారని ప్రజలు ఆశించినా, నిరాశే మిగిలింది.

ఇవ్వాళ కెసిఆర్‌ పక్షాన వీరంతా కొత్త కార్యక్రమాన్ని తలకెత్తుకున్నారు. మోదీ ప్రభుత్వాన్ని విమర్శించడానికి దాశరథి పాటను రిఫరెన్సుగా తీసుకొని సుదీర్ఘ ప్రసంగం చేసినవారికి కాళోజీ మాటలు గుర్తుకు రాకపోవడం ఆశ్చర్యం. ‘...ప్రాంతంవాడే అన్యాయం చేస్తే పాతరేస్తాం’ అన్న వాక్యం కెసిఆర్‌ పాలనకు వర్తించదా? కెసిఆర్‌ ఫార్మ్ హౌస్ పాలన, ఒక్కరోజైనా సెక్రెటేరియెట్‌కు రాకపోవడం రాజ్యాంగ విరుద్ధం కాదా? రాజ్యాంగాన్నే మార్చి కొత్త రాజ్యాంగం కావాలనడం దేనికి సంకేతం? ప్రగతిభవన్‌ పేరుతో ‘గడీ రాజకీయం’ తప్పు కాదా? ప్రతిపక్ష పార్టీలను నిర్వీర్యం చేస్తూ, ఇతర పార్టీలలో గెలిచినవాళ్లను లొంగదీసుకొని తన పార్టీలో కలిపేసుకోవడం, మంత్రి పదవులు ఇవ్వడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడం కాదా? ఇలాంటివి లెక్కలేనన్ని. కెసిఆర్‌ చేతిలో చిలుకలుగా మారిపోయిన ఈ మేధావులు తెలంగాణ జనం ఘోషను వినడం మానేసి, తెలంగాణ ప్రజాస్వామ్యానికి ఢిల్లీ వల్లనే అపాయం ఉందని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. కెసిఆర్‌ వల్లనే తెలంగాణ ప్రజాస్వామిక వాతావరణం ప్రమాదంలో పడ్డదని వీళ్లు చెప్పగలిగిన నాడే తెలంగాణ అమరుల కుటుంబాలు, ప్రజాసంఘాలు, ప్రజలు వీరిని మళ్లీ ఆదరిస్తరు, మేధావులుగా గౌరవిస్తారు. అప్పటిదాకా వీళ్ళు పంజరంలో చిలుకలే.

సూర్యపల్లి శ్రీనివాస్

స్టేట్ కన్వీనర్, బిజెపి ఓబీసీ రీసెర్చ్ డివిజన్

Updated Date - 2022-12-16T01:44:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising