ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పెన్షనర్ల పోరాటయోధుడు

ABN, First Publish Date - 2022-12-16T01:29:37+05:30

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పెన్షనర్లందరు నేడు పెన్షన్ పొందుతూ ప్రశాంత జీవనం గడపడం వెనుక ధరమ్ స్వరూప్ నకారా (డి.ఎస్. నకారా) చేసిన కృషి, సాగించిన పోరాటం...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పెన్షనర్లందరు నేడు పెన్షన్ పొందుతూ ప్రశాంత జీవనం గడపడం వెనుక ధరమ్ స్వరూప్ నకారా (డి.ఎస్. నకారా) చేసిన కృషి, సాగించిన పోరాటం చిరస్మరణీయం. నకారా 1914 ఏప్రిల్ 8న ముంబైలో జన్మించారు. కేంద్ర ప్రభుత్వంలో ప్రభుత్వరంగ సంస్థలలో వివిధ పదవులు ఆయన సమర్థవంతంగా నిర్వహించారు. పెన్షన్ దారుల కోసం చేసిన న్యాయ పోరాటం ఆయనకు విశేషమైన గుర్తింపు తెచ్చింది. పదవీ విరమణ తరువాత భారత్ సేవా సమాజం న్యూఢిల్లీ పెన్షనర్స్ సర్వసభ్య సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పెన్షన్ చెల్లింపులలో ప్రభుత్వాల వివక్షతను గమనించారు. ఆనాడు వచ్చే కొద్దిపాటి పెన్షన్ తో కుటుంబ జీవనం గడపడం కష్టమయ్యేది. కేంద్ర ప్రభుత్వ సరళీకృత పింఛన్ విధానం ద్వారా లభించే ఆర్థిక, ఇతర సౌలభ్యాలు 1979 మార్చి 31 నాటికి సర్వీసులో ఉన్న వారికే వర్తిస్తాయని, అంతకుముందు పదవీ విరమణ చేసినవారికి వర్తించవని 1979 మే 25న కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. అవి పెన్షన్ దారులను కుంగదీశాయి. స్వయంగా పెన్షన్ బాధితుడైన నకారా మరికొందరితో కలసి సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. 1982 డిసెంబర్ 17న సుప్రీంకోర్టు చారిత్రాత్మకమైన తీర్పును వెలువరించింది. అందులో పెన్షనర్స్ అందరినీ ఒకే తరగతిగా పరిగణించి ఒకే ఫార్ములాతో పెన్షనరీ ప్రయోజనాలు వర్తింపజేయాలి.. పక్షపాత ధోరణితో వ్యవహరించకూడదని కోర్టు చెప్పింది.

నకారా చేసిన కృషి ఫలితంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల లక్షలాది పెన్షనర్ల జీవితాలకు ముసురుకున్న చీకట్లు తొలగిపోయాయి. నకారా తన శేష జీవితాన్ని పెన్షనర్స్ సేవలోనే గడిపాడు. 2009 జూలై 29న ఆయన పెన్షనర్స్ పోరాట యోధునిగానే తుది శ్వాస విడిచారు. ఆయన త్యాగాలను, న్యాయ పోరాటాలను స్మరించుకుంటూ పెన్షనర్స్ సమస్యలపై ఉద్యమిద్దాం. అదే మనం ఆయనకు అర్పించే ఘన నివాళి.

వెలిశోజు రామ మనోహర్

(రేపు జాతీయ పెన్షనర్స్ డే)

Updated Date - 2022-12-16T01:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising