ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

Chennai: చేసుకుందే రెండో పెళ్లి.. భార్యను మంచిగా చూసుకోవాల్సింది పోయి.. ఆమె పనిచేస్తున్న ఆఫీస్‌కు వెళ్లి..

ABN, First Publish Date - 2022-05-07T19:53:18+05:30

మొదటి భార్యతో మనస్పర్థలు రావడంతో విడాకులిచ్చాడు. మరో యువతిని ప్రేమించి రెండో పెళ్లి చేసుకున్నాడు. కొన్నాళ్లు వీరి కాపురం సాఫీగానే..

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

చెన్నై: మొదటి భార్యతో మనస్పర్థలు రావడంతో విడాకులిచ్చాడు. మరో యువతిని ప్రేమించి రెండో పెళ్లి చేసుకున్నాడు. కొన్నాళ్లు వీరి కాపురం సాఫీగానే సాగిపోయినా ఆఫీస్‌కు వెళుతున్న భార్యపై అనుమానం పెంచుకున్నాడు. మరింత దిగజారి ఆమె పనిచేసే ఆఫీస్‌కు వెళ్లి ఎవరూ ఊహించని పనిచేశాడు. చివరకు కటకటాల పాలయ్యాడు.



ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చెన్నైకి సమీపంలోని తిరుముల్లైవోయిల్‌కు చెందిన విష్ణు అనే 28 ఏళ్ల యువకుడు మిల్క్ ప్యాకెట్లు సప్లయ్ చేస్తుంటాడు. అతని భార్య పవిత్ర ఒక ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. విష్ణుకు ఇది వరకే ఓ యువతితో వివాహం అయింది. భార్యాభర్తల మధ్య గొడవలు రావడంతో విష్ణు మొదటి భార్య నుంచి విడాకులు తీసుకున్నాడు. 2018లో పవిత్ర అనే యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నాడు గానీ పెళ్లి తర్వాత భార్యపై ప్రేమతో పాటు అనుమానం కూడా పెంచుకున్నాడు.



ఆఫీస్‌కు వెళుతున్న భార్యను అనుమానిస్తూ.. ఆఫీస్‌లో ఎవరితోనో వివాహేతర సంబంధం పెట్టుకున్నావంటూ ఆమెతో రోజూ గొడవలు పడుతుండేవాడు. అతని ప్రవర్తన భరించలేక పవిత్ర తీవ్ర మనస్తాపం చెందింది. విష్ణు ప్రవర్తనతో విసిగిపోయిన పవిత్ర కొన్ని రోజులుగా అతనికి దూరంగా ఉంటోంది. పుట్టింటికి వెళ్లిపోయింది. అయినా విష్ణు అనుమానం అంతటితో ఆగలేదు. భార్య దూరం కావడంతో గత రాత్రి ఆమె పనిచేసిన ఆఫీస్‌కు వెళ్లి పెట్రోల్ బాంబు విసిరాడు. ఆ ఘటనను వీడియో తీసుకుని అక్కడి నుంచి పారిపోయాడు. ఆ వీడియోను తన భార్యకు పంపి ఆమెను బెదిరించాడు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు అందడంతో పారిపోయి రైల్వే స్టేషన్‌లో తిరుగుతున్న విష్ణును పోలీసులు అరెస్ట్ చేశారు. విష్ణుపై విల్లివక్కం పోలీస్ స్టేషన్‌లో ఇప్పటికే దొంగతనం కేసు, పోక్సో కేసు పెండింగ్‌లో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!