మద్యం లారీ బోల్తా
ABN , First Publish Date - 2022-05-12T15:40:20+05:30 IST
మదురై సమీపంలో మద్యం స్టాకుతో వెళ్తున్న వ్యాన్ బోల్తాపడడంతో, కిందపడిన బాటిళ్లు ఎత్తుకెళ్లేందుకు మద్యం ప్రియులు పోటీపడ్డారు. మదురై సమీపంలోని
- పోటాపోటీగా బాటిళ్లు ఎత్తుకెళ్లిన మందుబాబులు
పెరంబూర్(చెన్నై): మదురై సమీపంలో మద్యం స్టాకుతో వెళ్తున్న వ్యాన్ బోల్తాపడడంతో, కిందపడిన బాటిళ్లు ఎత్తుకెళ్లేందుకు మద్యం ప్రియులు పోటీపడ్డారు. మదురై సమీపంలోని మనలూరు మద్యం గోడౌన్ నుంచి బుధవారం ఉదయం సుమారు రూ.10 లక్షల విలువైన మద్యంతో బయల్దేరిన సరుకు వ్యాన్ వీరనూరు రింగ్ రోడ్డులో వస్తూ అదుపుతప్పి బోల్తాపడింది. దీంతో, వ్యాన్‌లోని మద్యం సీసాలు రోడ్డుపై చెల్లాచెదురుగా పడ్డాయి. విషయం తెలిసి మద్యం ప్రియులు మద్యం కోసం పోటీపడ్డారు.