ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

Unusual Incident: ఇలాంటోళ్లు కూడా ఉంటారా.. గొప్పోడివిరా బాబు.. ఎవరి ఇంట్లో ఉంటూ ఏం చేశాడో తెలిస్తే..

ABN, First Publish Date - 2022-05-06T01:31:47+05:30

అన్నం పెట్టిన ఇంటికే కన్నం వేసిన దొంగల గురించి విని ఉంటారు. తాళం వేసిన ఇళ్లను టార్గెట్ చేసి దొంగతనాలు చేసిన వారి గురించి చదివి ఉంటారు. కానీ.. ఇలాంటి దొంగ గురించి మాత్రం..

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

భువనేశ్వర్: అన్నం పెట్టిన ఇంటికే కన్నం వేసిన దొంగల గురించి విని ఉంటారు. తాళం వేసిన ఇళ్లను టార్గెట్ చేసి దొంగతనాలు చేసిన వారి గురించి చదివి ఉంటారు. కానీ.. ఇలాంటి దొంగ గురించి మాత్రం అరుదుగా విని ఉంటారు. ప్రియురాలితో జల్సా చేయడం కోసం తోడబుట్టిన సోదరి ఇంట్లో డబ్బు, నగలను కాజేశాడు ఈ ప్రబుద్ధుడు. అంతేకాదు.. తన సోదరి స్కూటీని కూడా దొంగిలించాడు. తన సోదరుడు చేసిన ఘనకార్యం గురించి తెలుసుకున్న సదరు మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ దొంగ చివరికి కటకటాల పాలయ్యాడు. ఈ ఘటన భువనేశ్వర్‌లోని చంద్రశేఖర్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.. జగత్‌సింగ్‌పూర్ జిల్లాకు చెందిన రంజిత్ అనే యువకుడు చంద్రశేఖర్‌పూర్ పరిధిలో ఉన్న తన సోదరి ఇంట్లో ఉంటున్నాడు. రంజిత్ గత కొన్ని నెలలుగా ఓ యువతితో చనువుగా ఉంటున్నాడు. ఇద్దరూ జల్సాగా షికార్లు చేశారు.



రంజిత్ వద్ద ఉన్న డబ్బు అయిపోయింది. తన ప్రేయసితో కలిసి తిరగడం కోసం సోదరి ఇంట్లోనే దొంగతనం చేయాలని రంజిత నిర్ణయించుకున్నాడు. సోదరుడిపై నమ్మకంతో ఇంటి దగ్గరే ఉంటున్నాడనే భరోసాతో బీరువాకు తాళం వేయకుండా ఆమె వెళ్లిపోయింది. ఆమె బయటకు వెళ్లి వచ్చేలోపు ఇంట్లో ఉన్న రూ.50 వేల డబ్బు, బంగారం కనిపించలేదు. బయట చూస్తే స్కూటీ కూడా లేదు. రంజిత్ చూస్తే ఇంట్లో లేడు. సోదరుడి ప్రవర్తనపై కొద్దిరోజులుగా అనుమానంతో ఉన్న ఆమె ఈ పరిణామంతో రంజితే దొంగతనం చేశాడని అర్థమై పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు ఇతగాడిని ఎట్టకేలకు అదుపులోకి తీసుకున్నారు. రంజిత్ దొంగిలించిన సొమ్మును రికవరీ చేసి, స్కూటీని కూడా అతని సోదరికి ఇచ్చేశారు. ఇతనిని అదుపులోకి తీసుకున్న తర్వాత పోలీసులు క్రిమినల్ బ్యాగ్రౌండ్ పరిశీలించగా రంజిత్‌పై పలు పోలీస్ స్టేషన్లలో పెండింగ్ కేసులు ఉన్నట్లు తేలింది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!