ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

Gurugram: వ్యక్తిని కొట్టిచంపిన ఏడుగురి అరెస్ట్

ABN, First Publish Date - 2022-05-05T22:07:44+05:30

ఓ ఆటో డ్రైవర్‌ను కొట్టి చంపిన కేసులో ఏడుగురు నిందితులను గురుగ్రామ్ పోలీసులు అరెస్ట్ చేశారు. డబ్బుల విషయంలో

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

గురుగ్రామ్: ఓ ఆటో డ్రైవర్‌ను కొట్టి చంపిన కేసులో ఏడుగురు నిందితులను గురుగ్రామ్ పోలీసులు అరెస్ట్ చేశారు. డబ్బుల విషయంలో డ్రైవర్ సోదరుడు, అరెస్ట్ అయిన నిందితుల్లో ఒకరికి మధ్య వివాదం జరిగింది. ఇది కాస్తా ముదరడంతో 10-15 మంది ఆటో డ్రైవర్ సుమిత్ సోలంకిని సోమవారం రాత్రి కొట్టిచంపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను విశాల్ అలియాస్ విక్కీ, రాహుల్ అలియాస్ ఠాకూర్, నితీశ్ అలియాస్ ఆకాశ్, అన్షుల్, అనుభవ్ అలియాస్ గుడ్డు, సోను కుమార్, హిమాన్షులుగా గుర్తించారు. వారి నుంచి ఓ మోటార్ సైకిల్, స్కూటర్, బాధితుడిని కొట్టి చంపేందుకు ఉపయోగించిన కర్రలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులు తమ నేరాన్ని అంగీకరించినట్టు పోలీసులు తెలిపారు. పరారీలో ఉన్న ఇతర నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నట్టు చెప్పారు.  


బాధితుడు సోలంకి సోదరుడు రోహిత్‌కు, ఈ కేసులో ప్రధాన నిందితుడైన విశాల్‌కు మధ్య రూ. 1.50 లక్షల విషయంలో గొడలు జరుగుతున్నట్టు పోలీసులు తెలిపారు. బాధితుడికి, నిందితుడికి మధ్య ముందే పరిచయం ఉందని, ఓ వివాహం సమయంలో ఇద్దరి మధ్య వాగ్వివాదం జరిగినట్టు పోలీసులు తెలిపారు. నిందితులు తొలుత రోహిత్‌పైన, ఆ తర్వాత సుమిత్‌పైన దాడిచేసినట్టు ఏసీపీ (క్రైమ్) ప్రీత్‌పాల్ సంగ్వాన్ తెలిపారు. 


రోహిత్, తన సోదరుడు సుమిత్‌తో కలిసి సెక్టార్-9లో జరిగిన ఓ వివాహానికి హాజరయ్యాడు. టెంట్ వెనక దాక్కున్న నిందితులు రోహిత్‌ను పట్టుకుని చావబాదారు. అయితే, వారి బారి నుంచి రోహిత్ ఎలాగోలా తప్పించుకున్నాడు.  అప్పుడు నిందితులు అతడి సోదరుడు సుమిత్‌ను పట్టుకుని తీవ్రంగా కొట్టడంతో అతడు చనిపోయినట్టు ఏసీపీ తెలిపారు. 

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!