ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

Whatsappలో మరో ఫీచర్.. అడ్మిన్స్‌కు అపరిమిత అధికారాలు

ABN, First Publish Date - 2022-05-07T01:38:17+05:30

మెసేజింగ్ యాప్ వాట్సాప్ మరో నయా ఫీచర్ తీసుకొచ్చే పనిలో ఉన్నట్టు తెలుస్తోంది. ఈసారి గ్రూప్స్‌ కోసం

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

న్యూఢిల్లీ: మెసేజింగ్ యాప్ వాట్సాప్ మరో నయా ఫీచర్ తీసుకొచ్చే పనిలో ఉన్నట్టు తెలుస్తోంది. ఈసారి గ్రూప్స్‌ కోసం తీసుకొస్తున్న ఈ ఫీచర్‌లో అడ్మిన్‌కు సర్వాధికారాలు ఇవ్వనుంది. అంటే గ్రూపులో ఏ ఒక్కరు పోస్టు చేసిన మెసేజ్‌ను అయినా అడ్మిన్ డిలీట్ చేయవచ్చన్నమాట. అడ్మిన్ ఆ పోస్టును డిలీట్ చేసిన విషయం పోస్టు చేసిన గ్రూప్ సభ్యుడికి తెలుస్తుంది కూడా. అంతేకాదు, గ్రూప్ సభ్యుడు చేసిన పోస్టును డిలీట్ చేయడానికి బదులుగా క్యాన్సిల్ కూడా చేయొచ్చు.


మెసేజ్‌ను అడ్మిన్ డిలీట్ చేసిన విషయం గ్రూప్ సభ్యులందరికీ తెలుస్తుంది. ప్రస్తుతం అభివృద్ధి దశలో ఉన్న ఈ ఫీచర్ త్వరలోనే బీటా టెస్టర్ల కోసం అందుబాటులోకి రానుంది. కాగా, డిలీట్ ఫర్ ఎవరీవన్ ఫీచర్‌లో మెసేజ్‌ను డిలీట్‌ను చేసే సమయాన్ని గంటా 8 నిమిషాల 16 సెకన్ల నుంచి రెండు రోజుల 12 గంటల వరకు పెంచాలని యోచిస్తోంది. ఈ ఫీచర్‌ను 2017లో వాట్సాప్‌ తీసుకొచ్చింది. అంతకుముందు మెసేజ్‌ను డిలీట్ చేసేందుకు ఏడు నిమిషాల సమయం మాత్రమే ఉండేది. ఈ ఫీచర్ అందుబాటులోకి రావడం వల్ల పొరపాటుగా సెండ్ అయిన మెసేజ్‌లను డిలీట్ చేసే అవకాశం యూజర్లకు దక్కింది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!