Twitter : ఎలాన్ మస్క్‌ను నడిపిస్తున్న ‘ఆ ఐదుగురు’.. అంతా వాళ్లే..

ABN , First Publish Date - 2022-11-07T19:05:28+05:30 IST

ప్రపంచ కుబేరుడు, టెస్లా (Tesla) అధినేత ‘ఎలాన్ మస్క్’ (Elon musk) సోషల్ నెట్‌వర్క్ కంపెనీ ‘ట్విటర్’ను (Twitter) ఇటివలే టేకోవర్ చేసుకున్నారు. ఆదాయ మార్గాలపై ఆయన దృష్టిసారించారు. ఇందులో భాగంగానే పెద్ద సంఖ్యలో ఉద్యోగులకు ఉద్వాసన, ‘బ్లూటిక్ మార్క్‌’ సబ్‌స్ర్కిప్షన్‌పై ఫీజు వంటి ఆలోచనలు చేస్తున్నారు.

Twitter : ఎలాన్ మస్క్‌ను నడిపిస్తున్న ‘ఆ ఐదుగురు’.. అంతా వాళ్లే..

ప్రపంచ కుబేరుడు, టెస్లా (Tesla) అధినేత ‘ఎలాన్ మస్క్’ (Elon musk) సోషల్ నెట్‌వర్క్ కంపెనీ ‘ట్విటర్’ను (Twitter) ఇటివలే టేకోవర్ చేసుకున్నారు. ఆదాయ మార్గాలపై అన్వేషణ మొదలుపెట్టారు. ఇందులో భాగంగానే పెద్ద సంఖ్యలో ఉద్యోగులకు ఉద్వాసన, ‘బ్లూటిక్ మార్క్‌’ సబ్‌స్ర్కిప్షన్‌పై ఫీజు వంటి సమాలోచన చేస్తున్నారు. మరి ట్విటర్‌ను పటిష్టం చేయాలనుకుంటున్న ఎలాన్ మస్క్‌ వెన్నంటి ఉన్నదెవరూ? ఎవర్ని నమ్ముకుని ఆయన ముందుకెళ్తున్నారు? అనే ప్రశ్నలకు సమాధానమే మస్క్ ప్రధాన టీమ్‌లోని ‘ఆ ఐదుగురు’. మస్క్ ఆస్తులను నిర్వహించే ఫ్యామిలీ ఆఫీస్ హెడ్ జారెడ్ బిర్చల్ (Jared Birchall), మస్క్‌ సన్నిహితుడైన ఎంట్రప్రెన్యూర్ జాసన్ కలకనిస్ (Jason Calacanis), భారతీయ మూలాలున్న శ్రీరామ్ క్రిష్ణన్ (Alex Spiro), సెలబ్రిటీ లాయర్- హైప్రొఫైల్ వ్యక్తి అలెక్స్ స్పిరో (Sriram Krishnan), ఇన్వెస్టర్ డేవిడ్ సాక్స్(David Sacks) వీళ్లు ఐదుగురూ ఎలాన్ మస్క్‌కు అన్ని విషయాల్లో సాయపడుతున్నారు.

- జారెడ్ బిర్చల్.. ఎలాన్ మస్క్ కుటుంబ ఆస్తుల నిర్వహణా కార్యాలయం హెడ్‌గా పనిచేస్తున్నారు. ఇతడిని మార్చి 2016లో ఎలాన్ మస్క్ స్వయంగా నియమించుకున్నారు. జారెడ్ బిర్చల్ గతంలో మోర్గాన్ స్టాన్లీ బ్యాంకర్‌గా పనిచేసిన అనుభవం ఉంది. ఇతర వ్యాపార అనుభవాలు కూడా ఆయన సొంతం.

- జాసన్ కలకనిస్ ఔత్సాహిక పారిశ్రామికవేత్త. ఎలాన్ మస్క్‌తో సాన్నిహిత్యం ఉంది. బ్లూటిక్ మార్క్ సబ్‌స్ర్కిప్షన్‌పై ఫీజును తొలుత వెల్లడించిన వ్యక్తి ఈయనే. జనాల అభిప్రాయాలను పోల్ నిర్వహించి తెలుసుకున్నారు.

- అలెక్స్ స్పిరో ఒక సెలబ్రిటీ లాయర్. ఎలాన్ మస్క్‌కు ఎంతోకాలంగా న్యాయవాదిగా సేవలు అందిస్తున్నారు. హార్వర్డ్ లా స్కూల్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన ఆయన లా సంస్థ ‘క్విన్ ఇమ్మానుయేల్’ పార్టనర్‌గా ఉన్నారు. ట్విటర్ ఉద్యోగుల తొలగింపు వ్యవహారానికి న్యాయపరమైన చిక్కులు లేకుండా ఆయన పర్యవేక్షిస్తున్నారు.

- భారతీయ మూలాలున్న శ్రీరామ్ క్రిష్ణన్ (Sriram Krishnan) ఎలాన్ మస్క్‌కు సన్నిహితుడు. అంతేకాదు ట్విటర్ మాజీ ఉద్యోగి కూడా. ట్విటర్ టేకోవర్ నేపథ్యంలో ఎలాన్ మస్క్‌కు తాత్కాలికంగా సాయం చేస్తున్నట్టు శ్రీరామ్ క్రిష్ణన్ స్వయంగా వెల్లడించారు.

- డేవిడ్ సాక్స్ (David Sacks) చాలా కాలంగా ఎలాన్ మస్క్‌కు సన్నిహితుడు. మస్క్ మాదిరిగానే డేవిడ్ సాక్స్ కూడా దక్షిణాఫ్రికాలోనే పుట్టాడు. పేపాల్‌లో (PayPal) పనిచేసే సమయంలో మస్క్‌తో కలిసి పనిచేశారు.

Updated Date - 2022-11-07T19:12:35+05:30 IST

Read more