శ్రేయాస్ మీడియా రూ.30 కోట్ల సమీకరణ
ABN , First Publish Date - 2022-05-04T08:07:47+05:30 IST
మూవీ ఈవెంట్స్, ప్రమోషన్స్‌లో అగ్రగామిగా ఉన్న శ్రేయాస్ మీడియా రూ.30 కోట్ల నిధులను సమీకరించనున్నట్లు ప్రకటించింది.

హైదరాబాద్: మూవీ ఈవెంట్స్, ప్రమోషన్స్‌లో అగ్రగామిగా ఉన్న శ్రేయాస్ మీడియా రూ.30 కోట్ల నిధులను సమీకరించనున్నట్లు ప్రకటించింది. వ్యూహాత్మక ఇన్వెస్టర్ల నుంచి ఈ నిధులను సమీకరిస్తున్నట్లు తెలిపింది. 2011లో కార్యకలాపాలు ప్రారంభించిన ఈ సంస్థ ఇప్పటికే దక్షిణాది రాష్ట్రాల్లో 1,500కు పైగా ఈవెంట్స్‌ను నిర్వహించింది. తాజాగా దుబాయ్‌లో కార్యకలాపాలు ప్రారంభించింది. సమీకరించిన నిధులను పశ్చిమాసియా, అమెరికా సహా భారత్‌లో కార్యకలాపాల విస్తరణకు ఉపయోగించనున్నట్లు శ్రేయాస్ గ్రూప్ వ్యవస్థాపకుడు గండ్ర శ్రీనివాస్ రావు తెలిపారు. సినిమా ఈవెంట్స్‌కు అనుబంధంగా కొత్త విభాగాల్లో ప్రవేశించనున్నట్లు ఆయన చెప్పారు. గత ఆర్థిక సంవత్సరంలో సంస్థ రూ.20 కోట్ల టర్నోవర్‌ను నమోదు చేసిందని వివరించారు. కాగా 2027 నాటికి ఏటా 650 మూవీ ఈవెంట్స్, 120 మూవీ ప్రమోషన్స్‌ను చేపట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు శ్రీనివాస్ తెలిపారు.