ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

మరో జీవితకాల కనిష్ఠానికి Rupee.. నష్టాలబాటలో Stock markets

ABN, First Publish Date - 2022-05-13T00:02:36+05:30

ముంబై : మరో జీవితకాల కనిష్ఠానికి దేశీయ కరెన్సీ రూపాయి క్షీణించింది. గురువారం డాలర్‌ మారకంలో 77.63 స్థాయికి రూపాయి దిగజారింది.

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

ముంబై : దేశీయ కరెన్సీ రూపాయి మరో జీవితకాల కనిష్ఠానికి క్షీణించింది. గురువారం డాలర్‌‌పై మారకంలో 77.63 స్థాయికి రూపాయి దిగజారింది. అయితే చివరకు కాస్తంత కోలుకుని 77.5025 వద్ద ముగిసింది. ఈ వారంలో ఇది రెండవ అత్యుల్పం కావడం విశేషం. దేశీయ మార్కెట్ల నుంచి పెట్టుబడుల ఉపసంహరణకు ఫారెన్ ఇన్వెస్టర్లు మొగ్గుచూపుతుండడం ఇందుకు ప్రధాన కారణమవుతోంది.  


కాగా దేశీయ మార్కెట్లు వరుసగా ఐదవ రోజు గురువారం కూడా తీవ్ర నష్టాలతో ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 1158 పాయింట్లు లేదా 2.14 శాతం క్షీణించి 52,930.31 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 359 పాయింట్లు లేదా 2.22 శాతం నష్టపోయి 15,808 పాయింట్ల వద్ద ముగిసింది. కాగా దేశీయ సూచీలకు ఇది 2 నెలల కనిష్ఠానికి దిగజారినట్టయింది. రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్‌డీఎఫ్‌సీ, బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్‌సర్వ్ షేర్లు 2-3 శాతం వరకు దిగజారాయి. నిఫ్టీ50 పతనంలో ఈ షేర్ల భాగస్వామ్యం అధికంగా ఉంది. కాగా అత్యధికంగా అదానీ పోర్ట్స్ 6 శాతం వరకు క్షీణించింది. గ్లోబల్ మార్కెట్ల సంకేతాలు ప్రతికూలంగా ఉండడంతోపాటు దేశీయంగా ద్రవ్యోల్బణానికి సంబంధించిన డేటాపై మదుపర్లు దృష్టిసారించడం మార్కెట్ల పతనానికి కారణమైంది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!