ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

రూపాయి ‘బేర్‌’

ABN, First Publish Date - 2022-05-13T06:46:26+05:30

ఫారెక్స్‌ మార్కెట్లో రూపాయి మరో చారిత్రక కనిష్ఠ స్థాయికి దిగజారింది. గురువారం అమెరికన్‌ డాలర్‌ మారకంలో రూపాయి మరో 25 పైసలు నష్టపోయి 77.50 వద్ద ముగిసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

మరో ఆల్‌టైమ్‌ కనిష్ఠ స్థాయి 77.50కి పతనం

ముంబై : ఫారెక్స్‌ మార్కెట్లో రూపాయి మరో చారిత్రక కనిష్ఠ స్థాయికి దిగజారింది. గురువారం అమెరికన్‌ డాలర్‌ మారకంలో రూపాయి మరో 25 పైసలు నష్టపోయి 77.50 వద్ద ముగిసింది. ఒక దశలో ఆల్‌టైమ్‌ ఇంట్రాడే కనిష్ఠ స్థాయి 77.63 వరకు కూడా పతనమైంది. ఆరంభంలో 77.52 వద్ద  ప్రారంభమైన రూపాయి ఇంట్రాడేలో 77.36-77.63 మధ్యన కదలాడింది. సోమవారంనాడు రూపాయి చారిత్రక కనిష్ఠస్థాయి 77.44 వద్ద ముగిసిన విషయం విదితమే. ఆరు కరెన్సీల బాస్కెట్‌తో కూడిన డాలర్‌ ఇండెక్స్‌ రెండు దశాబ్దాల గరిష్ఠ స్థాయి 104.51కి చేరడం రూపాయిపై ప్రభావం చూపింది. దీనికి తోడు దేశీయంగా రిటైల్‌ ద్రవ్యోల్బణం 8 ఏళ్ల గరిష్ఠ స్థాయికి చేరడం, దేశీయ ఇన్వెస్టర్లు రిస్క్‌కు విముఖంగా ఉండడం, నిరాఘాటంగా సాగుతున్న విదేశీ ఇన్వెస్టర్ల నిధుల ఉపసంహరణ కూడా రూపాయిపై ఒత్తిడిని పెంచాయి. రూపాయి ఆటుపోట్లను అరికట్టేందుకు ఆర్‌బీఐ రంగంలోకి దిగడంతో మరింత పతనాన్ని నిలువరించిందని ఫారెక్స్‌, బులియన్‌ అనలిస్ట్‌ గౌరంగ్‌ సోమయ్య అన్నారు.

మరికొద్ది రోజులు దూకుడుగానే డాలర్‌: మరికొద్ది రోజుల పాటు డాలర్‌ బుల్‌రన్‌ ఇలాగే కొనసాగే అవకాశం ఉందని విశ్లేషకులంటున్నారు. గురువారం విదేశీ ఇన్వెస్టర్లు రూ.5,255 కోట్ల విలువ గల ఈక్విటీలు విక్రయించారు. బుధవారం వారు విక్రయించిన షేర్ల విలువ రూ.3,609.35 కోట్లు. రూపాయి ఇలా నిరాఘాటంగా పతనం కావడం దేశీయంగా ధరలపై ప్రభావం చూపడం ఖాయమని, రాబోయే నెలల్లో ద్రవ్యోల్బణం మరింతగా దూసుకుపోవచ్చని కూడా భయాలు వ్యాపించాయి. రూపాయి క్షీణత ప్రత్యక్ష ప్రభావం నేరుగా క్రూడాయిల్‌ దిగుమతులపై పడుతుంది. ఇది ద్రవ్యోల్బణానికి ఆజ్యం పోస్తుంది. పరిస్థితి ఇలాగే ఉంటే అదుపు తప్పిన ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు ఆర్‌బీఐ రెపో రేటును తక్షణ చర్యగా జూన్‌లో జరిగే ఎంపీసీ సమావేశంలోనే మరో 0.5 శాతం పెంచినా ఆశ్చర్యపోనక్కరలేదని విశ్లేషకులంటున్నారు. ఇదిలా ఉండగా అంతర్జాతీయ విపణిలో బ్రెంట్‌ క్రూడాయిల్‌ బ్యారెల్‌ ధర 2.02 శాతం తగ్గి 105.7 డాలర్లకు దిగివచ్చింది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!