ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

ఎడిబుల్ ఆయిల్... పరిమితులపై కొరడా

ABN, First Publish Date - 2022-05-11T21:11:37+05:30

ఏడు రాష్ట్రాల్లో edible oil హోర్డింగ్, బ్లాక్ మార్కెటింగ్ నివారణలో భాగంగా... స్టాక్ పరిమితులను విధించడంతోపాటు, ఏప్రిల్‌లో తనిఖీలను నిర్వహించడానికి అవసరమైన ‘వస్తువుల చట్టం’లోని నిబంధనలు అమల్లోకొచ్చాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

* అమలులోకి చట్ట నిబంధనలు

న్యూఢిల్లీ : ఏడు రాష్ట్రాల్లో edible oil హోర్డింగ్, బ్లాక్ మార్కెటింగ్ నివారణలో భాగంగా... స్టాక్ పరిమితులను విధించడంతోపాటు, ఏప్రిల్‌లో తనిఖీలను నిర్వహించడానికి అవసరమైన ‘వస్తువుల చట్టం’లోని నిబంధనలు అమల్లోకొచ్చాయి. కిందటి నెలలో కేంద్రం ప్రారంభించిన తనిఖీ డ్రైవ్‌లో ఏడు రాష్ట్రాల్లో ఎడిబుల్ ఆయిల్‌ హోర్డింగ్ / బ్లాక్ మార్కెటింగ్ ను కనుగొన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్, పశ్చిమ బెంగాల్, తెలంగాణ, మధ్యప్రదేశ్‌లలో హోర్డింగ్, బ్లాక్ మార్కెటింగ్ లను గుర్తించారు. ఉల్లంఘనలు జరిగినట్లు ఆహార & ప్రజా పంపిణీ శాఖ ఈ రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు సమాచారమిచ్చినట్లు ఆ వర్గాలు తెలిపాయి. 


రాష్ట్రంలోని వివిధ చమురు ప్రాసెసింగ్ ప్రాంతాల్లో తనిఖీలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వాధికారులతో పాటు ఎనిమిది కేంద్ర ప్రభుత్వ బృందాలను నియమించినట్లు ఆ వర్గాలు వెల్లడించాయి. స్టాక్ పరిమితులను విధించడానికి, తనిఖీలను నిర్వహించడానికి కేంద్రం నిత్యావసర వస్తువుల చట్టంలోని నిబంధనలను అమలు చేసింది. స్టాక్ లిమిట్ ఆర్డర్‌లు తినదగిన నూనెలు, నూనెగింజల నిల్వలు, పంపిణీని నియంత్రించడానికి కేంద్ర ప్రభుత్వానికి, అన్ని రాష్ట్రాలు సహా యూటీలకు అధికారమిస్తాయన్న విషయం తెలిసిందే. కాగా... స్టాక్ పరిమితి ఆర్డర్‌లు ఏప్రిల్ 1 నుండి అమల్లోకి వచ్చాయన్న విషయం తెలిసిందే. కాగా... సంవత్సరం చివరి వరకు ఇవి చెల్లుబాటులో ఉంటాయి. ప్రస్తుతం దేశీయంగానే వంటనూనెల ఉత్పత్తి డిమాండ్‌ను అందుకోని పరిస్థితి ఉంది. డిమాండ్/సరఫరా మధ్య అంతరాన్ని తీర్చేక్రమంలో... భారత్ పెద్దఎత్తున దిగుమతులపై ఆధారపడుతోంది. దేశంలో వినియోగించే దాదాపు 56 శాతం ఎడిబుల్ ఆయిల్‌ దిగుమతి అవుతోంది.


ఇటీవలి భౌగోళిక, రాజకీయ సంఘటనల నేపథ్యంలో... అన్ని తినదగిన నూనెల అంతర్జాతీయ ధరలను ఆల్-టైమ్ గరిష్ఠ స్థాయిలకు పెరిగాయి. ఈ క్రమంలో... హోర్డింగ్/లాభదాయకత వంటి అంశాల ప్రాతిపదికన ఎటువంటి అక్రమమైన పద్ధతులను ఆశ్రయించకుండా ఉండేలా దేశీయ మార్కెట్ భాగస్వాములను తనిఖీ చేయవలసిన అవసరమున్నట్లు  ప్రకటన పేర్కొంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) గవర్నర్ శక్తికాంత దాస్ ఈ నెల(మే) 4 న... ఐరోపాలో వివాదం సహా కీలక ఉత్పత్తిదారుల ఎగుమతి నిషేధాల కారణంగా భారత్ కు సంబంధించిన ద్రవ్యోల్బణ-సున్నితమైన వస్తువులైన ఎడిబుల్ ఆయిల్స్ కొరతను ఎదుర్కొంటున్నాయంటూ పేర్కొన్న విషయం తెలిసిందే. 

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!