ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

ఇటాలియన్ లగ్జరీ లైఫ్‌స్టైల్ బ్రాండ్‌ Tod'sతో జతకట్టిన Reliance Brands Limited

ABN, First Publish Date - 2022-05-10T00:59:19+05:30

ఇటాలియన్ లగ్జరీ లైఫ్‌స్టైల్ టోడ్స్ (Tod's)ను భారతీయ మార్కెట్లో రిటైల్ చేసేందుకు రిలయన్స్‌కు చెందిన

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

న్యూఢిల్లీ: ఇటాలియన్ లగ్జరీ లైఫ్‌స్టైల్ టోడ్స్ (Tod's)ను భారతీయ మార్కెట్లో రిటైల్ చేసేందుకు రిలయన్స్‌కు చెందిన రిలయన్స్ బ్రాండ్స్ లిమిటెడ్ (RBL) ఆ సంస్థతో మల్టీ ఇయర్ ఫ్రాంచైజీ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ దీర్ఘకాలిక ఒప్పందం ద్వారా టోడ్స్‌కు చెందిన ఫుట్‌వేర్, హ్యాండ్స్ బ్యాంగ్స్, యాక్సెసరీస్‌కు భారత మార్కెట్లో అధికారిక రిటైలర్‌గా మారినట్టు రిలయన్స్ తెలిపింది.  


టోడ్స్ భారతదేశంలో 2008 నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఢిల్లీలోని డీఎల్ఎఫ్ ఎంపోరియో, ముంబైలోని పల్లాడియమ్, రిలయన్స్ ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ అజియో లక్స్‌లలో ఆ సంస్థ మోనోబ్రాండ్ స్టోర్లు ఉన్నాయి. ఇప్పుడు వీటిని ఆర్‌బీఎల్ స్వాధీనం చేసుకుంటుంది. మార్కెట్లో బ్రాండ్ సామర్థ్యాన్ని పెంపొందించడం, డిజిటల్‌గా అందుబాటులో ఉండే సౌకర్యాలను మరింత మెరుగుపరచడంపై ఆర్‌బీఎల్ దృష్టిసారించింది. 


ఈ సందర్భంగా ఆర్‌బీఎల్ ఎండీ దర్శన్ మెహతా మాట్లాడుతూ..  అసాధారణ నాణ్యత, నైపుణ్యం కలిగిన డోడ్స్ గ్లోబల్ లగ్జరీ ఫ్రంట్‌లు తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానాన్ని సొంతం చేసుకుందని, భారత మార్కెట్లో ఇప్పుడు దానిని నిలబెట్టేందుకు ఒప్పందం కుదుర్చుకున్నందుకు సంతోషంగా ఉందని పేర్కొన్నారు. దేశంలోని ప్రముఖ లగ్జరీ రిటైలర్‌తో భాగస్వామ్యం కావడం సంతోషంగా ఉందని  టోడ్స్ జనరల్ బ్రాండ్ మేనేజర్ కార్లో అల్బెర్టో బెరెట్టా అన్నారు.  

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!