హైసియా కొత్త ప్రెసిడెంట్‌గా మనీషా సాబు

ABN , First Publish Date - 2022-05-10T08:59:27+05:30 IST

హైదరాబాద్‌ సాఫ్ట్‌వేర్‌ ఎంటర్‌ప్రైజెస్‌ అసోసియేషన్‌ (హైసియా) కొత్త ప్రెసిడెంట్‌గా ఇన్ఫోసిస్‌, హైదరాబాద్‌ సెజ్‌ అధిపతి మనీషా సాబు ఎన్నికయ్యారు.

హైసియా కొత్త ప్రెసిడెంట్‌గా మనీషా సాబు

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): హైదరాబాద్‌ సాఫ్ట్‌వేర్‌ ఎంటర్‌ప్రైజెస్‌ అసోసియేషన్‌ (హైసియా) కొత్త ప్రెసిడెంట్‌గా ఇన్ఫోసిస్‌, హైదరాబాద్‌ సెజ్‌ అధిపతి మనీషా సాబు ఎన్నికయ్యారు. హైసియా 30వ సర్వసభ్య సమావేశం లో ఆమెను ఎన్నుకున్నారు. హైసియా ప్రెసిడెంట్‌ బాధ్యతలను నిర్వహిస్తున్న తొలి మహిళ ఈమే అవుతుందని హైసియా వెల్లడించింది. మనీషాకు సాఫ్ట్‌వేర్‌ రంగంలో 20 ఏళ్ల అనుభవం ఉంది. కార్పొరేట్‌ ప్రపంచంలో ఉత్తమ నాయకత్వ ప్రతిభను కనబరిచినందుకు తెలంగాణ ప్రభుత్వం నుంచి ‘ఉమెన్‌ ఎచీవర్‌ అవార్డు’ను కూడా అందుకున్నారు. 2022-24 కాలానికి హైసియా ప్రెసిడెంట్‌ బాధ్యతలను నిర్వహిస్తారు. ఫస్ట్‌సోర్స్‌ ప్రెసిడెంట్‌, సీఓఓ నాదెళ్ల ప్రశాంత్‌ హైసియా వైస్‌ ప్రెసిడెంట్‌గా, జనరల్‌ సెక్రటరీగా ఆరోప్రో సాఫ్ట్‌ సిస్టమ్స్‌ ప్రెసిడెంట్‌ రామకృష్ణ లింగిరెడ్డి ఎన్నికయ్యారు.

Read more