ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

కోట్లు సంపాదించాలంటే... సూత్రం చెప్పిన ఎలాన్ మస్క్

ABN, First Publish Date - 2022-05-05T01:35:54+05:30

డబ్బు సంపాదించాలంటే ధైర్యం, తెగువ, కష్టపడే తత్వం, తెలివి, కాస్త అదృష్టం ఉండాలి. ఎవరైనా ఇదే చెబుతారు. ప్రపంచంలోని అపరకుబేరుల్లో ఒకరైనా, సోషల్ మీడియా దిగ్గజాల్లో ఒకటైన ట్విట్టర్‌ను కొనుగోలు చేసిన టెస్లా కార్ల కంపెనీ అధినేత ఎలాన్ మస్క్ లో ఈ లక్షణాలన్నీ ఉన్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

న్యూయార్క్ : డబ్బు సంపాదించాలంటే ధైర్యం, తెగువ, కష్టపడే తత్వం, తెలివి, కాస్త అదృష్టం ఉండాలి. ఎవరైనా ఇదే చెబుతారు. ప్రపంచంలోని అపరకుబేరుల్లో ఒకరైనా, సోషల్ మీడియా దిగ్గజాల్లో ఒకటైన ట్విట్టర్‌ను కొనుగోలు చేసిన టెస్లా కార్ల కంపెనీ అధినేత ఎలాన్ మస్క్ లో ఈ లక్షణాలన్నీ ఉన్నాయి. బాలం నుంచీ కష్టపడుతూ, తన మెదడుకి పని పెడుతూ మిలియన్ల కొద్దీ డాలర్లను సంపాదించారు మస్క్. ఆ తర్వాత ఎంతో ధైర్యంతో వ్యాపారాలు చేసి, ఇప్పుడు అనూహ్యమైన రీతిలో డబ్బు సంపాదించారు. ఈ స్థాయిలో సంపదను సంపాదించిన మస్క్ వద్ద చాలా అనుభవం ఉంది. అందుకే ఆయన వద్ద ఆర్థిక పాఠాలు నేర్చుకునేందుకు కోట్లాది మంది ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో స్టాక్ మార్కెట్ ద్వారా డబ్బు ఎలా సంపాదించాలో సింపుల్‌గా చెప్పేసారు మస్క్. ఓ ట్వీట్ ద్వారా మస్క్ చెప్పిన ఈ సింపుల్ సూత్రం ఇప్పుడు వైరల్ గా మారింది. ‘స్టాక్ మార్కెట్లో సంపాదన గురించి నన్ను చాలామంది అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను. ఏవైతే కంపెనీలు ప్రొడక్ట్స్ తయారు చేస్తాయో ? లేదా ? సర్వీసెస్ ఆఫర్ చేస్తాయో ? వాటిపై మీకు నమ్మకం ఉంటే ఇన్వెస్ట్ చేయండి. ఈ కంపెనీలు చాలా వరస్ట్ గా మారుతున్నాయనే సంకేతాలు కనిపించినప్పుడు వెంటనే మీ స్టాక్స్ అమ్మేయండి. మిగతా సమయంలో సేల్ చేయకండి. అప్పుడప్పుడు మార్కెట్ up and downs చోటుచేసుకుంటూంటాయి. అలాంటప్పుడు భయపడకండి. ఫుల్ క్లారిటీ ఉంటేనే షేర్స్ అమ్మండి. అప్పుడే  దీర్ఘకాలికంగా మంచి లాభాలు దక్కుతాయి’ అని ఎలాన్ మస్క్ సింపుల్ గా చెప్పేశారు. స్టాక్ మార్కెట్‌లో దిగేవారిలో చాలామంది... చాలా తక్కువ సమయంలో ఎక్కువ డబ్బును  ఆర్జించాలని ఆశపడుతుంటారు. కానీ ఈ ధోరణి లాంగ్ టర్మ్ లో భారీ నష్టాలను మిగుల్చుతుంది’ అని మస్క్ ముక్తాయించారు. మరి ఈ ట్విట్ మీద నెటిజన్ల తీరు ఎలా ఉంటుందోన్న విషయమై చర్చోపచర్చలు నడుస్తున్నాయి.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!