ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

కెనరా బ్యాంక్‌ లాభంలో 64% వృద్ధి

ABN, First Publish Date - 2022-05-07T06:51:45+05:30

ప్రభుత్వ రంగంలోని కెనరా బ్యాంక్‌.. 2021-22 ఆర్థిక సంవత్సరం మార్చితో ముగిసిన చివరి త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలను ప్రకటించింది. జనవరి-మార్చి త్రైమాసికంలో బ్యాంక్‌ నికర లాభం ఏకంగా 64.90 శాతం వృద్ధితో రూ.1,666 కోట్లుగా నమోదైంది..

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

క్యూ4లో రూ.1,666 కోట్లుగా నమోదు

2021-22 ఆర్థిక సంవత్సర లాభం రూ.5,678 కోట్లు 

బెంగళూరు (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ రంగంలోని కెనరా బ్యాంక్‌.. 2021-22 ఆర్థిక సంవత్సరం మార్చితో ముగిసిన చివరి త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలను ప్రకటించింది. జనవరి-మార్చి త్రైమాసికంలో బ్యాంక్‌ నికర లాభం ఏకంగా 64.90 శాతం వృద్ధితో రూ.1,666 కోట్లుగా నమోదైంది. వడ్డీ ఆదాయాలు గణనీయంగా పెరగటంతో పాటు మొండి పద్దులు తగ్గటం కలిసివచ్చిందని కెనరా బ్యాంక్‌ ఎండీ, సీఈఓ ఎల్‌వీ ప్రభాకర్‌ వెల్లడించారు. అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2020 -21) ఇదే కాలంలో బ్యాంక్‌ నికర లాభం రూ.1,010,87 కోట్లుగా ఉంది. త్రైమాసిక సమీక్షా కాలంలో మొత్తం ఆదాయం కూడా రూ.21,040.63 కోట్ల నుంచి రూ.రూ.22,323.11 కోట్లకు పెరిగింది. కాగా మార్చి త్రైమాసికంలో నికర వడ్డీ ఆదాయం 25 శాతం వృద్ధితో రూ.7,005 కోట్లుగా ఉందని ప్రభాకర్‌ తెలిపారు.


అయితే వడ్డీయేతర ఆదాయం మాత్రం 5.12 శాతం క్షీణించి రూ.4,462 కోట్లుగా నమోదైందని పేర్కొన్నారు. కాగా ఈ కాలంలో స్థూల మొండి పద్దులు (ఎన్‌పీఏ) 8.93 శాతం నుంచి 7.51 శాతానికి తగ్గినట్లు ఆయన చెప్పారు. నికర ఎన్‌పీఏలు కూడా 3.82 శాతం నుంచి 2.65 శాతానికి తగ్గాయి. కాగా మార్చితో ముగిసిన 2021-22 ఆర్థిక సంవత్సరానికి గాను బ్యాంక్‌ నికర లాభం ఏకంగా రెండింతలు పెరిగి రూ.5,678 కోట్లుగా నమోదైంది. 2020-21లో బ్యాంక్‌ లాభం రూ.2,557.58 కోట్లుగా ఉంది. ఈ కాలంలో బ్యాంక్‌ మొత్తం ఆదాయం కూడా రూ.84,204.78 కోట్ల నుంచి రూ.85,907.15 కోట్లకు పెరిగింది. ఆర్థిక ఫలితాలు ప్రోత్సాహకరంగా ఉండటంతో రూ.10 ముఖ విలువ కలిగిన ప్రతి షేరుకు రూ.6.5 (65 శాతం) డివిడెండ్‌ను బ్యాంక్‌ డైరెక్టర్ల బోర్డు సిఫారసు చేసింది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!