Amazon Summer Sale: స్మార్ట్ఫోన్లు, ఎలక్ట్రానిక్స్‌పై ఆఫర్లే ఆఫర్లు
ABN , First Publish Date - 2022-05-04T00:18:37+05:30 IST
ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ సమ్మర్ సేల్‌తో మళ్లీ వినియోగదారుల ముందుకు వచ్చేస్తోంది

న్యూఢిల్లీ: ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ సమ్మర్ సేల్‌తో మళ్లీ వినియోగదారుల ముందుకు వచ్చేస్తోంది. రేపటి (బుధవారం) నుంచి ఈ వార్షిక ఫెస్టివల్ సేల్ ప్రారంభం కానుంది. సేల్‌లో భాగంగా స్మార్ట్ఫోన్లు, ఎలక్ట్రానిక్స్‌పై పలు ఆఫర్లు లభించనున్నాయి. స్మార్ట్ టీవీలు, గేమింగ్ యాక్సెసరీలపైనా ఆఫర్లు లభించనున్నాయి.
Apple iPhone 13ను భారీ రాయితీతో కొనుగోలు చేసుకోవచ్చు. దీని అసలు ధర రూ. 70,900 కాగా రూ. 66,900కే అందుబాటులో తీసుకొచ్చింది. అలాగే, ఐకూ, ఐటెల్, వన్‌ప్లస్, ఒప్పో, రియల్‌మి, రెడ్మి, శాంసంగ్, టెక్నో, వివో, Xiaomi ఫోన్లను కూడా భారీ రాయితీలతో కొనుగోలు చేసుకోవచ్చు.