మీ కాళ్లు విరగ్గొడతానన్నది మీ బాబే

ABN , First Publish Date - 2022-05-14T09:32:53+05:30 IST

మీ కాళ్లు విరగ్గొడతానన్నది మీ బాబే

మీ కాళ్లు విరగ్గొడతానన్నది మీ బాబే

అది బయటపెట్టారనేగా రోశయ్యపై కక్ష..!: నారా లోకేశ్‌

అమరావతి, మే 13(ఆంధ్రజ్యోతి): ‘‘జగన్‌రెడ్డీ... నీ అరాచకం, అబద్ధాలు, మోసాలు, బెదిరింపులు భరించలేక ఏపీలో అడుగుపెడితే కాళ్లు విరగ్గొడతానన్నది మీ బాబు వైఎస్‌... మా బాబు కాదు. ఈ విషయం దివంగత నేత రోశయ్య బయటపెట్టారనే కదా ఆయనపై నీకు కక్ష..!’’ అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ వ్యాఖ్యానించారు. శుక్రవారం ఆయన ఒక ప్రకటన చేశారు. కాగా, ‘‘ప్రతిపక్షాలు, ప్రజలు అయిపోయారు. ఇప్పుడు పోలీసుల వంతు వచ్చింది. నిజాయితీగా పనిచేసే ఒక పోలీసు అధికారిని కక్ష సాధింపు చర్యలతో బలితీసుకుంది వైసీపీ ప్రభుత్వం’’ అని విమర్శించారు. ‘‘కాకినాడ జిల్లా సర్పవరం ఎస్‌ఐ గోపాలకృష్ణను వెంటాడి వేధించి చంపేశారని అనుమానాలున్నాయి. కక్షసాధింపుల వల్లే గోపాలకృష్ణ మరణించగా, సాటి పోలీసులే కట్టుకథలు అల్లడం విచారకరం. ఎస్‌ఐ అనుమానాస్పద మృతిపై న్యాయవిచారణ జరగాలి. దోషులు ఎవరైనా కఠినంగా శిక్షించాలి. మృతిచెందిన గోపాలకృష్ణ కుటుంబాన్ని ఆదుకోవాలి. చనిపోయింది మనవాడు కాదనుకునే పోలీసుల వరకూ ఈ కక్ష సాధింపులు వస్తాయి. అప్పుడు మీ వైపు ఎవరూ ఉండరు’’ అని లోకేశ్‌ అన్నారు.

Read more