వైసీపీ సర్కార్‌పై విరుచుకుపడ్డ Sailajanath

ABN , First Publish Date - 2022-05-10T17:32:31+05:30 IST

వైసీపీ ప్రభుత్వంపై కాంగ్రెస్ నేత శైలజానాథ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

వైసీపీ సర్కార్‌పై విరుచుకుపడ్డ Sailajanath

అమరావతి: వైసీపీ ప్రభుత్వంపై కాంగ్రెస్ నేత శైలజానాథ్(Sailajanath) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఏ ముఖం పెట్టుకొని ప్రజల్లోకి వెళతారని ప్రశ్నించారు. ‘‘మూడేళ్లలో జగన్ రెడ్డి ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఏది అంటూ నిలదీశారు. ‘‘ప్రత్యేక హోదా సాధనలో విఫలమైనందుకా?... విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపినందుకా?.. ఉద్యోగ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్లు ఏవి?.పన్నులు పెంచినందుకా...? ప్రాజెక్టులు పూర్తి చేయనందుకా?.అప్పులు చేసి ప్రజలపై భారం మోపినందుకా?’’ అంటూ ప్రశ్నలు కురిపించారు. అరాచక పాలనపై ప్రజలే తిరగబడే రోజు వచ్చిందన్నారు. తాడేపల్లి ప్యాలస్‌లో కూర్చుని బటన్ నొక్కటం అభివృద్ధి కాదని సూచించారు. ప్రజలే బటన్ నొక్కి తాడేపల్లి ప్యాలస్‌లో పెర్మనెంట్‌గా కూర్చోబెట్టే రోజులు వస్తున్నాయన్నారు. పొత్తుల గోల వదిలి అభివృద్ధిపై దృష్టి పెట్టాలని శైలజానాథ్ హితవుపలికారు. 

Read more