భీమవరంలో ఆక్రమణల తొలగింపు
ABN, First Publish Date - 2022-05-14T06:08:21+05:30
పట్టణంలోని పదకొండు రోడ్లలో ట్రాఫిక్‌కు అంతరాయంగా ఉన్న ఆక్రమణల తొలగింపు పనులను శుక్రవా రం మధ్యాహ్నం నుంచి మునిసిపల్ అఽధికారులు చేపట్టారు.
భీమవరం టౌన్, మే 13 : పట్టణంలోని పదకొండు రోడ్లలో ట్రాఫిక్‌కు అంతరాయంగా ఉన్న ఆక్రమణల తొలగింపు పనులను శుక్రవా రం మధ్యాహ్నం నుంచి మునిసిపల్ అఽధికారులు చేపట్టారు. కొంత మంది స్వచ్ఛందంగా తొలగించుకుని అధికారులకు సహకరిం చగా, రోడ్ల పక్కన డ్రెయిన్లను దాటి ముందుకు వచ్చిన బోర్డులను తొలగించారు. వెంకట్రామ థియేటర్ రోడ్డులో మాత్రం తమకు సమాచారం ఇవ్వలేదని కొంత మందిషాపు యజమానులు చెప్పగా సాయం త్రం లోగా తొలగించుకునే అవకాశం ఇచ్చారు. విస్సాకోడేరు వంతెన దగ్గర రోడ్డుకు ఇరువైపులా ఉన్నా షాపులను పూర్తిస్థాయిలో షాపు యజమానులే స్వచ్ఛందంగా తొలగించడం విశేషం. జువ్వలపాలెం, ఉండి రోడ్డు, ప్రకాశం చౌక్, సుంకర పద్దయ్యగారి రోడ్డు, నరసాపురం రోడ్డు, పీపీ రోడ్డు, ఛాంబర్‌ఆఫ్ కామర్సు రోడ్డు, రెస్ట్‌హౌస్ రోడ్డు, గొల్లవాని తిప్పరోడ్డు తదితర రోడ్లలో తొలగింపు ప్రక్రియ సాగింది. శనివారం కూడా కొనసాగే అవశాలు ఉన్నాయి. ఆక్రమణల తొల గింపు సందర్భంగా ప్రధాన రోడ్లలో ట్రాఫిక్‌కు ఇబ్బంది ఏర్పడింది. పట్టణంలో ఆక్రమణ తొలగింపు ప్రక్రియకు ప్రత్యేక టీమ్‌లు ఏర్పాటు చేశారు. ఒక్కొ రోడ్డుకు ఒక నోడల్ ఆఫీసర్‌ను నియమించారు. వార్డు పరిధిలోని సచివాలయ సిబ్బంది, 20 మంది శానిటేషన్ సిబ్బంది, ఎక్స్‌కవేటర్, రెండు ట్రాక్టర్లను ఏర్పాటు చేశారు. పట్టణంలో ఆక్రమణల తొలగింపును మునిసిపల్ కమిషనర్ ఎస్.శివరామకృష్ణ పరిశీలించారు. ఉండి రోడ్డులో కాఫీహోటల్స్, కర్రి పాయింట్, యజమానులతో మాట్లాడుతూ చెత్త వేసేందుకు పెద్ద సైజు బిన్ ్స ఏర్పా టు చేసుకోవాలని డ్రెయిన్ దాటి వచ్చిన బోర్డులను తొలగించాలని ఆదేశించారు.