కంపెనీ కలిసొచ్చింది
ABN, First Publish Date - 2022-05-14T06:13:53+05:30
నరసాపురం తీరం ఒకప్పుడు చౌడు దిబ్బలకు నెలవు.
మూడు దశాబ్దాల సుదీర్ఘ పోరాటం
టీడీపీ హయాంలోనే ఓసారి క్లియరెన్స్
వైసీపీ హయాంలో మూడేళ్లు జాప్యం
కోట్ల రూపాయలు దళారుల పాలు
ఎట్టకేలకు దిగొచ్చిన ప్రభుత్వం
వంద రూపాయలకే భూములను స్వాధీనపర్చాలని నిర్ణయం
( భీమవరం–ఆంధ్రజ్యోతి ప్రతినిధి):
నరసాపురం తీరం ఒకప్పుడు చౌడు దిబ్బలకు నెలవు. రైతులు సమష్టి కృషితో బ్రిటీష్ ప్రభుత్వ కాలం నుంచే భగీ రథ యత్నాలు చేశారు. అప్పట్లోనే దర్భరేవు కేంద్రంగా ‘ది నరసాపురం అగ్రికల్చర్ కంపెనీ లిమిటెడ్’ పేరిట 1920 లో నే ఆరంభమైంది. ఇలా కంపెనీగా ఏర్పడిన రైతులు బ్రిటీష్ ఆధీనంలోని భూములను సాగు చేయడం ఆరంభించారు. అప్పటి నుంచి ఇప్పటివరకు తరాలుగా సుదీర్ఘ కాలం సాగు చేస్తున్న భూమి తమ ఆధీనంలో ఉన్నప్పటికీ క్రయవిక్రయా లకు తావులేకుండా అష్టకష్టాలు పడ్డారు. అప్పటి తెలుగు దేశం హయాంలో కంపెనీ భూములను రైతులకు పట్టాలు గా ఇచ్చేందుకు కేబినెట్ తీర్మానం చేసింది. ఆ తర్వాత అధికా రంలోకి వచ్చిన వైసీపీ ఈ వ్యవహారాన్ని చూసీచూడనట్టుగా వది లేసింది. ఇప్పుడు తాజాగా వంద రూపాయలు కడితే చాలు కంపెనీ భూమి మీ సొంతం అంటూ తాజాగా జగన్ కేబినెట్ నిర్ణయించింది. దశాబ్దాల పోరాటానికి ఫలితం దక్కిందని రైతులు ఒకింత ఊపిరి పీల్చుకున్నారు.
అసలు కథ ఇది..
ఒకప్పుడు బ్రిటీష్ కాలంలో తీర ప్రాంత భూములన్నీ ప్రభుత్వ ఆధీనంలోనే ఉండేవి. ఈ భూములను ఎవరైనా స్వాధీనపర్చుకుని, సాగు చేసినా ప్రభుత్వం అధికారికంగా పట్టాలు ధ్రువపరిచేందుకు అంగీకరించనేలేదు. దీంతో అప్పట్లో నరసాపురం ప్రాంత రైతులు దర్భరేవు కేంద్రంగా ఒక కంపెనీగా ఏర్పడ్డారు. అప్పట్లో సమష్టిగా కొందరు ముం దుకొస్తే బ్రిటీష్ ప్రభుత్వం కంపెనీగా పరిగణించేది. దర్భరేవు కేంద్రంగా తీర ప్రాంత భూములను సాగు భూమిగా మార్చ డానికి రైతు కుటుంబాలు యావత్తు కష్టపడ్డాయి. తీర ప్రాంతం యావత్తు ఉప్పు ప్రాంతం కాబట్టి నరసాపురం నుంచి దర్భరేవు వరకు ఏకంగా రైతులే శ్రమదానం చేసి సొంతంగా కాల్వ నిర్మించుకున్నారు. ఇంకే ముంది దాదాపు 1700 ఎకరాల్లో వారి ‘పంట’ పండింది. వీరిలో ఎకరం నుంచి పది ఎకరాలు స్తోమత కలిగిన రైతులు ఉన్నారు.
రైతుల గోడు విన్న టీడీపీ ప్రభుత్వం
బియ్యపుతిప్ప, వేములదీవి, సారవ, మర్రితిప్ప ప్రాంతాల్లో ఒకప్పుడు 1485 ఎకరాల భూమి సుమారు 2 వేల 500 మంది రైతుల ఆధీనంలో ఉన్నట్టు అప్పట్లో లెక్కకట్టారు. 2019లో తెలుగుదేశం ప్రభుత్వం తీర ప్రాంత రైతులు ఎదుర్కొంటున్న కష్టాలను పరిగణనలోకి తీసుకుని బ్రిటీష్ కాలం నాటి భూములను ప్రస్తుతానికి ఎవరైతే సాగు చేసు కుంటున్నారో వారికి స్వాధీనపరిచేందుకు సమాయత్తమ య్యారు. రిజిస్ట్రేషన్, స్టాంప్ మినహాయింపు ఇస్తూ వెయ్యి రూపాయలు కడితే చాలంటూ గడిచిన అసెంబ్లీ ఎన్నికలకు ముందే మంత్రివర్గ సమావేశంలో తీర్మానించారు. రైతుల్లో అత్యధికులు బడుగు, బలహీన వర్గా లకు చెందిన వారే కావడంతో వారి లో కొత్త ఆశలు చిగురింపచేశాయి.
మూడేళ్లు ముప్పతిప్పలు..
అనంతరం అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం మూడేళ్లుగా కాలయాపన చేస్తూనే వచ్చింది. ప్రభుత్వ జా ప్యాన్ని ఆసరాగా చేసుకుని గడిచిన కొన్నేళ్లుగా రైతుల నుంచి వసూళ్లకు పాల్పడినవారెందరో. అదికూడా రూపాయి.. రెండు రూపాయలు కాదు.. ఏకంగా కోట్లలోనే. కొందరి మీద బహిరంగంగా ఆరోపణలు వచ్చినా, మరికొందరిపై కేసులు నమోదు చేసినా కంపెనీ భూముల దందా కొనసాగింది. వీటిలో కొంతమంది రాజకీయ ప్రముఖుల హస్తం లేక పోలేదు. సమాంతరంగా అధి కారులు జేబులు నింపుకున్నా రు. ఈ తరహా పరిస్థితి నుంచి బయటపడేందుకు రైతులు అప్పులు చేసి మరీ అడిగినప్పుడల్లా దళారుల చేతులు తడి పారు. స్థానిక నేతలు ఎక్కడికక్కడ వివాదం ముదరకుండా జాగ్రత్తపడుతూ వచ్చారు.
అప్పుడు వెయ్యి... ఇప్పుడు వంద
కంపెనీ భూముల రైతుల కష్టాలకు తెర దించుతూ రాష్ట్ర మంత్రివర్గం మరోసారి తుది నిర్ణయం తీసుకుంది. ఎవరైతే కంపెనీ భూములు సాగు చేస్తున్నారో అలాంటి వారికి ఆయా భూముల హక్కులు కల్పిస్తూ, ఇలాంటి వారంతా వంద రూపాయలు చెల్లిస్తే చాలని మంత్రివర్గం తీర్మానిం చింది. స్టాంప్లు, రిజిస్ట్రేషన్ చార్జీల నుంచి మినహాయింపు ఇస్తూ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. అప్పట్లో ఈ తరహా మినహాయింపు వెయ్యి రూపాయలతో సరిపెడితే, ఇప్పుడు మాత్రం కేవలం వంద రూపాయలకే ప్రభుత్వం పచ్చ జెండా ఊపింది. అయితే ఇప్పుడు మంత్రివర్గం చేసిన తీర్మానంలో లబ్ధిదారుల సంఖ్య వెయ్యిగానే ప్రకటించడం రైతుల్లో అనుమానాలను రగిలింపచేస్తోంది. ఒకప్పుడు దాదా పు 1400 మంది ఉన్న రైతుల సంఖ్య ఇప్పుడు ఎలా కుచిం చుకు పోయిందనే అనుమానాలకు బీజం వేసింది. అధికారు లు ఈ విషయంలో కొంతమంది రైతులను జాబితా నుంచి తొలగించారా, లేదంటే దీనిపై ఇంకా స్పష్టత రానుందా అనే చర్చ జరుగుతోంది. ప్రస్తుతం ఆయా కంపెనీ భూములు ఎకరా రూ.20–45 లక్షల మధ్య ధర పలుకుతోంది. కాస్తంత సన్నకారు రైతులైతే ఎకరా, రెండు ఎకరాలు మాత్రమే వారి స్వాధీనంలో ఉంటే ఇంకొందరికి ఐదు నుంచి పది ఎకరాలు ఉన్నాయి. వారంతా ఆయా భూములను తరతరాలుగా అను భవిస్తూ వచ్చారు. అలాగే భూములను అభివృద్ధి పరిచారు. ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో సరికొత్త వెలు గులు చిమ్మినట్టయ్యింది. రాజకీయాల్లో నరసాపురానికి ఒక ప్రత్యేకత ఉంది. ఇదే సందర్భంలో కంపెనీ భూములు సాగు చేసుకునే రైతు కుటుంబాలే ఎన్నికల సమయంలోనూ అత్యంత కీలకం. ప్రత్యేకించి ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. అయితే హక్కు పత్రాలు వారికి అందేలా చేయడంలో జాప్యం చేయ కుంటే అదే పదివేలు.