ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

రొయ్యకు వైరస్‌

ABN, First Publish Date - 2022-05-14T06:06:35+05:30

అసాని తుఫాన్‌ ప్రభావంతో వాతావరణంలో చోటు చేసుకున్న మార్పులకు ఆక్వా అల్లాడిపోతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

వైట్‌గట్‌తో విలవిల.. రంగుమారి మృత్యువాత

గణపవరం/కలిదిండి/మండవల్లి, మే 13 : అసాని తుఫాన్‌ ప్రభావంతో వాతావరణంలో చోటు చేసుకున్న మార్పులకు ఆక్వా అల్లాడిపోతోంది. చెరువులో నిలకడగా ఉండాల్సిన ఉష్ణోగ్రతల్లో వ్యతాసాలు రావడంతో గురువారం సాయంత్రం నుంచి పీహెచ్‌ పడిపోయి వనామి రొయ్యలకు వైరస్‌, వైట్‌ గట్‌ సోకి మృత్యువాత పడుతున్నాయి. రొయ్య సెల్‌ లూజు కావటంతో నీటిలో తేలుతూ మృత్యువాత పడుతున్నాయి. గణపవరం, ఉంగుటూరు, భీమడోలు, నిడమర్రు, ఏలూరు రూరల్‌, కైకలూరు, కలి దిండి, మండవల్లి తదితర కొల్లేరు ప్రాంతాల్లోని మండలాల్లో వున్న వేలా ది ఎకరాల్లో వనామి సాగు చేస్తున్నారు. తాజాగా కలిదిండి, భాస్కరావు పేట, మూల్లంక, యడవల్లి, కొండంగి, సున్నంపూడితోపాటు తదితర గ్రామాల్లో చెరువుల్లో వైరస్‌తో రొయ్యలు చనిపోతుండటంతో హడావుడి గా పట్టుబడి చేస్తున్నారు. ఈ ఒక్క మండలంలోనే రూ.2 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు రైతులు చెబుతున్నారు. చనిపోయిన రొయ్యలు రంగు మారడంతో వాటిని ఎవరూ కొనుగోలు చేయడం లేదు. దీంతో వాటిని గోతిలో వేసి పూడుస్తున్నారు. ఎకరానికి రూ.2 లక్షల వరకు పెట్టుబడి పెట్టామని, కనీసం పెట్టుబడి ఖర్చులు రాకపోవటంతో తీవ్రంగా నష్టపోయి అప్పుల పాలవుతున్నామని రైతులు వాపోయారు. వేలాది రూ పాయల వెచ్చించి మందులు కొనుగోలు చేసి చెరువుల్లో చల్లుతు న్నప్పటికీ వ్యాధులు అదుపులోకి రావటం లేదని చెప్పారు. ఆక్సిజన్‌ ఏరియేటర్లు నిరంతరం తిరుగుతున్నప్పటికీ సమస్యలు తప్పడం లేదు. 

అయినకాడికి అమ్మకాలు

తుఫాన్‌ ప్రభావం, ఈదురుగాలులు, వాతావరణం చల్లబడటం, ఎండలతో రొయ్యలకు వైట్‌కట్‌, విబ్రో తదితర వ్యాధులు చుట్టుముటా ్టయి. ఉంగుటూరు నియోజకవర్గంలోని కొన్ని చెరువుల్లో రొయ్యలు చనిపోతుండగా మరికొన్ని చెరువుల్లో మట్టాల్లో కదలికలు లేకుండా చనిపోతున్నాయి. ఇప్పటికే విద్యుత్‌ కోతలతో నష్టాలు చవిచూడగా, మేతల ధరలు, డీజిల్‌, సాగు పెట్టుబడులు పెరిగిపోయి దిక్కుతోచని స్థితిలో రైతులు కొట్టుమిట్టాడుతున్నారు. కొంత మంది రైతులు అయిన కాడిన రొయ్యలను తెగనమ్ముకుంటున్నారు. ప్రస్తుతం 100 కౌంట్‌ 240 రూపాయలు, 90 కౌంట్‌ కిలో 250 రూపాయలకు, 80 కౌంట్‌ కిలో 270 రూపాయల చొప్పున ఉండగా.. ధర చూడకుండా రొయ్యలను హడావుడిగా పట్టుబడులు పట్టి విక్రయిస్తున్నారు. 


సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!