ఉచిత బియ్యం కావాలా ?

ABN , First Publish Date - 2022-05-14T06:16:14+05:30 IST

ప్రధాన మంత్రి గరీబ్‌ కల్యాణ్‌ యోజన(పీఎంజీకేవై) కింద రేషన్‌ కార్డుదారులకు అందించే ఉచిత బియ్యం నిలిపివేయాలా ? కొనసాగించాలా ?’ అంటూ సెంట్రల్‌ విజిలె న్స్‌ బృందం (న్యూఢిల్లీ) జంగారెడ్డిగూడెం, కామవరపుకోటల్లో శుక్రవారం కార్డుదారులను ప్రశ్నించింది.

ఉచిత బియ్యం కావాలా ?

కార్డుదారులను ప్రశ్నించిన సెంట్రల్‌ విజిలెన్స్‌ బృందం

జంగారెడ్డిగూడెం/కామవ రపుకోట, మే 13 : ప్రధాన మంత్రి గరీబ్‌ కల్యాణ్‌ యోజన(పీఎంజీకేవై) కింద రేషన్‌ కార్డుదారులకు అందించే ఉచిత బియ్యం నిలిపివేయాలా ? కొనసాగించాలా ?’ అంటూ సెంట్రల్‌ విజిలె న్స్‌ బృందం (న్యూఢిల్లీ) జంగారెడ్డిగూడెం, కామవరపుకోటల్లో శుక్రవారం కార్డుదారులను ప్రశ్నించింది. ఈ బియ్యం విషయంలో సంతృప్తి చెందు తున్నారా ? లేదా ? అనే విషయంపై ఆరా తీసింది. శుక్రవారం ఉదయం ఆరు నుంచి సాయంత్రం 6 గంటల వరకు జంగారెడ్డిగూడెంలో 160 మంది లబ్ధిదారుల అభిప్రాయాలను సేకరించింది. కామవరపుకోటలో 25వ నెంబర్‌ రేషన్‌ షాపును తనిఖీ చేసి నిల్వలు, రికార్డులను అధికారు లు సరిచూశారు. ప్రతీ నెలా ఏ తేదీల్లో రేషన్‌ ఇస్తున్నారు ? తరుగు వస్తుందా? వంటి వివరాలను కార్డుదారులను అడిగారు. సెంట్రల్‌ విజిలె న్స్‌ టీం డిప్యూటీ డైరెక్టర్‌ రతన్‌లాల్‌, మరో ఇద్దరు టీం సభ్యులు, డీఎస్‌ వో సుబ్బరాజు, తహసీల్దార్‌ జి.వి.వి.సత్యనారాయణ ఉన్నారు. 


Read more